నేటికాలంలో కొందరు పిల్లలు చేసే పనులు వారి తల్లిదండ్రులకు భయం, ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. తాజాగా ఓ పిల్లవాడు తన గత జన్మలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని అదృశ్యమయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని న్యూ విద్యానగర్ లో జరిగింది. ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ లోని విద్యానగర్లో నివసించే దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. విబేధాల కారణం ఆ దంపతులు ఇద్దరు వేరు వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో పిల్లలు తల్లి వద్ద ఉంటూ ఆన్ లైన్ ద్వారా చదువుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 1తేదిన 13 ఏళ్ల చిన్న కుమారుడు అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. దీంతో తల్లిదండ్రులు కంగారుపడిపోయారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోను వెతికిన ఫలితంలేకపోయింది. బంధువుల ఇళ్లలో సైతం బాలుడు గురించి ఆరా తీశారు.ఈక్రమంలో ఫోన్ లో బాలుడు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో ఒకటి బయటపడింది. అందులో ఆ బాలుడు అన్నమాటలు అందరికి ఆశ్చర్యానికి గురిచేశాయి. “మీరు నాతల్లిదండ్రులు కారు. నా పూర్వ జన్మలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతున్నాను” అంటూ చెప్పాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల మధ్య గొడవలు పిల్లలపై ప్రభావం చూపించే ఇలా ప్రవర్తించేందుకు అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.