ధనం.. మనిషిని బతికించే ఇంధనం.. ఈ మద్య కొంతమంది డబ్బు కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. ఎదుటి వారిని మోసం చేయడం.. అవసరమైతే చంపేందుకు వెనుకాడటం లేదు. దొంగతనాలు, కిడ్నాపులు, సైబర్ మోసాలు ఇలా ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
ఈ మద్య కొంతమంది డబ్బు సంపాదన కోసం ఎంతటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. ఎదుటి వారిని మోసం చేసి డబ్బు సంపాదించే క్రమంలో ప్రాణాలు కూడా తీస్తున్నారు. చైన్ స్నాచింగ్, సైబర్ మోసాల గురించి ప్రతిరోజూ ఎక్కడో అక్కడ వింటూనే ఉన్నాం. ఇటీవల కొంతమంది మహిళలు ఒంటరిగా ఉన్న చిన్నారులను కిడ్నాప్ చేసి డబ్బులకు అమ్ముకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివారాల్లోకి వెళితే..
కరీంనగర్ జిల్లా రామడుగులో రెండు సంవత్సరాల బాలుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసింది. తన వెంట తెచ్చుకున్న బ్యాగ్ లో బాలున్ని దాచిపెట్టింది. అటుగా వస్తున్న ఓ ఆటో ఆపి అందులో వెళ్లేందుకు ప్రయత్నించింది. పెగడపల్లి మండలం వద్ద సంచర్ల గ్రామానికి చెందిన మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి బ్యాగ్ కదలడం గమనించాడు. వెంటనే ఆమెను ఆ బ్యాగ్ లో ఏముంది అని ప్రశ్నించాడు. బ్యాగ్ లో ఏమీ లేదని ఆ మహిళ బుకాయించింది.. అందరికీ అనుమానం రావడంతో బ్యాగ్ ఓపెన్ చేయగా అందులో బాలుడు కనిపించాడు. వెంటనే మహిళను అడ్డుకొని బాలుడిని ఎందుకు దొంగిలించావు అని ప్రశ్నించాడు.
తాను బాలుడిని కిడ్నాప్ చేయలేదని.. బాలుడే తన వెంట వచ్చాడని బుకాయించింది. ఆ మహిళను స్థానికులు ఆపి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ ద్వారా వివరాలు రాబట్టారు. అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. మహిళపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. చిన్న పిల్లలను ఒంటరిగా విడిచి పెడితే ఇలాంటి మహిళలు, పురుషులు గుట్టు చప్పుడు కాకుండా బస్తాల్లో, బ్యాగుల్లో వేసుకొని ఎత్తుకెళ్తారని.. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు.