గత కొంత కాలంగా తెలంగాణలో అధికార పక్షం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. దుబ్బాకలో జరిగిన ఎన్నికలో ఎమ్మెల్యేగా రఘునందన్ రావు గెలిచారు.. ఇటీవల హుజూరాబాద్ లో జరిగిన ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా నిలిచిన ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో తెలంగాణలో బీజేపీని బలమైన పార్టీగా నిలిపేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు ఎంతో నమ్మకంతో కేసీఆర్ ని గెలిపిస్తే.. . కరెంట్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు ఇష్టమొచ్చినట్లు పెంచుతూ వారి నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయడం లేదని.. అందుకే కరెంట్ బకాయీలు వెయ్యి కోట్లకు పైగా పేరుకు పోయాయని అన్నారు. ‘ఒకప్పుడు ఎంఐఎం నాయకులు తమకు పదిహేను నిమిషాలు టైమ్ ఇస్తే హిందువులను లేకుండా చేస్తామని అన్నారు.
ఇప్పుడు నేను చెబుతున్నా.. బీజేపీ అధికారంలోకి వస్తే తబస్తీ గల్లీగల్లీలను జల్లెడపట్టి విద్యుత్ బకాయిలను వడ్డీతో సహా వసూలు చేస్తాం’ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇప్పటికే అనేక బాధలు పడుతున్న ప్రజలపై కేసీఆర్ రూ. 6 వేల కోట్ల భారం మోపారని బండి సంజయ్ అన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న వందలాది మంది బీజేపీ కార్యకర్తలను జైళ్లలో పెట్టారని మండిపడ్డారు.కేసీఆర్ పాలనను చూసి అమరుల ఆత్మలు ఘోషిస్తున్నయ్.. అని వ్యాఖ్యానించారు.
15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతామని ఎంఐఎం నాయకులన్నరు.
నేను చెబుతున్నా ఒవైసీ, కేసీఆర్!
తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నిమిషాలు విద్యుత్ సిబ్బందికి పాతబస్తీని అప్పజెప్పుతాం. పాతబస్తీ గల్లీగల్లీలను జల్లెడపట్టి విద్యుత్ బకాయిలను వడ్డీతో సహా వసూలు చేస్తాం. pic.twitter.com/TPr1mhIaQb— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 29, 2022