భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు అంబర్‌పేట్‌కు చెందిన బాలరాజు శనివారం గుండెపోటుతో మరణించారు. పార్టీకి ఎంతో సేవ చేసిన బాలరాజు మృతితో ఆ పార్టీ శ్రేణుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆనేం బాలరాజు మృతిచెందారు. తీవ్ర గుండెపోటుతో శనివారం అర్ధరాత్రి సమయంలో ఆయన కన్నుమూశారు. పార్టీ కార్యక్రమాల్లో ఎంతో యాక్టివ్‌గా ఉండే బాలరాజు మృతితో అంబర్‌పేట్, రామంతపూర్‌లోని పార్టీ శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలరాజు మృతి బీజేపీ నేతలతో పాటు పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.
ఇటివల కాలంలో గుండెపోటుతో మరణాలు ఎక్కువ అవుతున్నాయి. ఇటివల సినీ నటుడు నందమూరి తారక రత్న గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. అలాగేనే శనివారం రాత్రి మరో రాజకీయ నేత కూడా గుండెపోటుతో మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వరుపుల జోగిరాజు అలియాస్ రాజా శనివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. కాగా.. గుండెపోటుతో ఈ మధ్య వరుస మరణాలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. చాలా చిన్న వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.