ఒకప్పుడు హైదరాబాద్‌లో మాత్రమే బిర్యానీ లభించేది. కానీ ఇప్పుడు ప్రతి చోట బిర్యానీ లభిస్తోంది. పట్నాల నుండి పల్లెల్లోకి ఈ రుచి పాకింది. అయితే ఇంట్లో చేసిన బిర్యానీ కన్నా హోటల్స్ లో చేసే బిర్యానీ రుచి ఎక్కువగా ఉంటుందని భావించి వెళుతుంటాం. సుచి, శుభ్రతతో పని లేకుండా లాగించేస్తాం. అయితే ఓ రెస్టారెంట్ బిర్యానీ ప్రియులకు షాక్ నిచ్చింది.
బిర్యానీ అని పేరు వినపడగానే లొట్టేలేస్తాం. ఇక అదీ ఎలా ఉన్నా.. వేడి వేడిగా కంచెంలో పడిపోయిందంటే చాలు.. ఆవురావురమంటూ తినేస్తాం. ఇంట్లో చేసిన బిర్యానీ కన్నా హోటల్స్‌లో చేసే బిర్యానీలో ఏదో రుచి వస్తుందని ఆర్డర్ పెట్టేస్తాం. వీకెండ్స్ అయినా, చుట్టాలొచ్చినా లేదంటే పండగలైనా రెస్టారెంట్స్‌కు వెళ్లాల్సిందే. ముందుగా ఆర్డర్ చేసేది బిర్యానీనే. అందులోను బిర్యానీలో ఎన్నిరకాలున్నాయో అన్నింటిని టేస్ట్ చేయాలని ఆత్రుత చూపిస్తుంటారు. ఆ తర్వాతే మిగతా వాటి గురించి ఆలోచిస్తాం. ఇలాంటి బిర్యానీ ప్రియులకు షాక్‌నిస్తూ ఓ హోటల్ నిర్వాకం ఒకటి వీడియో రూపంలో బయటకు వచ్చింది.
ఘుమఘుమలాడే బిర్యానీ తిందామని ఓ హోటల్‌కు వెళ్లిన కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. బిర్యానీ తయారీకి వినియోగించే బియ్యాన్ని బాత్రూమ్‌లోని నీటితో కడుగుతున్నారని తెలిసి ఖంగుతిన్నాడు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని సోనీ రెస్టారెంట్‌లో జరిగింది. ఓ కస్టమర్ బిర్యానీ తిందామని ఆ హోటెల్‌కి వెళ్లాడు. చేతులు కడుగుదామని వాష్‌రూమ్‌లోకి వెళ్లాడు , అంతే అక్కడ కమోడ్ పక్కన బిర్యానీ రైస్ కడగడాన్ని చూసి అవాక్కయ్యాడు. ఇక్కడ బాత్రూమ్‌లో బియ్యాన్ని ఎందుకు కడుగుతున్నారన్ని యజమానిని అడిగితే.. మోటారు కాలిపోయింది నీళ్లు లేవు అందుకు అలా కడిగాం అంటూ సమాధానం ఇచ్చాడు.
నీళ్లు లేవని.. బాత్రూమ్ లో కడుగుతారా అని ప్రశ్నించాడు. ఇంకోసారి ఈ హోటల్ కు రావొద్దు అంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటనను వీడియో తీసి నెటింట్లో పెట్టడంతో వైరల్‌గా మారింది. దీనికి కామెంట్లు విపరీతంగా వస్తున్నాయి. పాయకాన బిర్యానీ అనీ..ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ‘బొంగు బిర్యానీ, బకెట్ బిర్యానీ, కుండ బిర్యానీ, బిందె బిర్యానీ, స్టీల్ డబ్బా బిర్యానీ.. ఇలా చాలా రకాలను మీరు చూసి ఉంటారు.. కానీ మా సిద్దిపేటలో సరికొత్త బిర్యానీ ఆవిష్కరించారు.. అదే బాత్‌రూం బిర్యానీ.. తినండి సూపర్ టేస్ట్’ అంటూ.. సోషల్‌మీడియాలో సైటెర్లు విసురుతున్నారు.
వారెవ్వా! సిద్దిపేట సోనీ రెస్టారెంట్ ల స్పెషల్ బిర్యానీ అట, ఏర్గవోయ్యే పాయఖనల స్పెషల్ గా బిర్యానీ రైస్ కడుగుతున్నరు!! తినొటోల్లు ఎగవడి తినండి!!! pic.twitter.com/Ft6PM6ceOH
— Vasu Ramagiri (@vasubjym) April 22, 2023