భారీ వర్షాల కారణంగా దేశంలో పలు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల వల్ల రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఆ వరదల్లో రోడ్డు దాటాలని ప్రయత్నిస్తే ఇక అంతే సంగతులు. రీసెంట్ గా రాజస్థాన్ లోని జైసల్మేర్ వద్ద ఒక బైకర్ వరదల్లో కొట్టుకుపోతుండగా తృటిలో తప్పించుకున్నాడు. స్థానికులు వెంటనే అతన్ని రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన మరువక ముందే తెలంగాణాలో మరో ఘటన చోటు చేసుకుంది.
తెలంగాణాలో కూడా భారీ వర్షాల కారణంగా వరద నీటితో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. ఈ వరద నన్ను ఏం చేస్తదిలే అని ఓ వ్యక్తి బైక్ మీద రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. దెబ్బకి ఆ వ్యక్తికి మైండ్ బ్లాక్ అయ్యింది. వరద ప్రవాహానికి బైక్ అదుపు తప్పింది. అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోసాగాడు. వెంటనే ఆ వ్యక్తి భయంతో బైక్ ను వదిలేసి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకొని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు.
బైక్ అక్కడే మునిగిపోయిందో, వరద ప్రవాహానికి కొట్టుకుపోయిందో తెలీదు గానీ పాపం బైక్ పోయినందుకు ఆ వ్యక్తి చాలా బాధపడి ఉంటాడు. ఏది ఏమైనా గానీ వరదే కదా అని దిగితే సరదా తీర్చేస్తది అనేది ఈ సంఘటన చూస్తేనే అర్ధమవుతుంది. కాబట్టి వాహనదారులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Bhadrachalam Floods: పోలవరం పూర్తయితే.. భద్రాద్రి రామాలయానికి ముప్పు తప్పదా?!