ఫ్రీగా వస్తుందంటే.. ఫినాయిల్ తాగేందుకు సిద్ధపడే జనాలు మన సమాజంలో కోకొల్లలుగా ఉన్నారు. చాలా మంది ఉచితంగా వచ్చే దేన్ని వదలరు. అసలే ఈ మధ్య కాలంలో ప్రతి దాని రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వంట నూనె, పెట్రోల్, డిజీల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇలాంటి సమయంలో ఏదైన సరుకుతో వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైతే జనాలు ఎగబడతారు. తాజాగా ప్రమాదానికి గురైన ఓ డీజిల్ ట్యాంకర్ పై స్థానికులు దండయాత్ర చేశారు.
ఒకప్పుడు ఏదైన వాహనం ప్రమాదానికి గురైతే ముందుగా సాయం చేసి.. బాధితులను కాపాడే వారు. అయితే నేటికాలంలో సహాయం చేసే గుణం కనుమరుగవుతుంది. వాహనానికి ప్రమాదం జరిగితే సహాయం చేసేది మరచి.. అందులోని వస్తువులను, సరకులను తీసుకునేందుకు ఎగబడుతుంటారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వంటి వాహనాలు ప్రమాదానికి గురైతే కొందరు బందీపోటు దొంగలా ప్రవర్తిసుంటారు. బకెట్లు, బిందెలు, బాటిల్స్ ఒక్కటేంటి ఏది దొరికితే దాని నిండా నింపుకెళ్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. డీజిల్ తో వెళ్తున్న ఓ లారీ భద్రాద్రి కొత్తగూడెంలో ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రోడ్డుపక్కన పడిపోయింది. ఇదే అదునుగా భావించిన సమీప గ్రామాల వాళ్లు డీజిల్ కోసం ఎగబడ్డారు. ఏది దొరికితే దానిని తెచ్చుకుని డీజిల్ ను నింపుకుని వెళ్లారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం సమీపంలో ఓ డీజిల్ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. డీజిల్ తో వస్తున్న ఓ ట్యాంకర్ మూల మలుపు వద్ద కంట్రోల్ కాకపోవడంతో అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. రహదారి పక్కకు వెళ్లిన క్రమంలో ఒక పక్కకు వరిగిపోయింది. అయితే ఆ డీజిల్ ట్యాంకర్ ను బయటకు తీసుకొచ్చే వీలు లేకపోయింది. ప్రమాదానికి గురైన లారీని బయటకు తెచ్చేందు చాలా సమయం పాటు డ్రైవర్ ప్రయత్నిచినా ఫలితం లేకుండా పోయింది. కాసేపటి తరువాత డీజిల్ లారీ ప్రమాదానికి గురైన విషయం సమీప గ్రామస్తులకు తెలిసింది.
ఇదే అదునుగా భావించిన స్థానికులు డీజిల్ ట్యాంకర్ పై దండయాత్ర చేశారు. బకెట్లు, వాటర్ క్యాన్లు తీసుకొచ్చి ట్యాంకర్ లోని డీజిల్ మొత్తం తీసుకెళ్లారు. లారీ డ్రైవర్ ఎంత చెప్పిన వినకుండా గ్రామస్తులు డీజిల్ ను బకెట్లలో నింపుకుని తీసుకెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు స్థానికులపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “మీ కక్కుర్తి తగలడ.. ఎవరైనా మర్చిపోయి అగ్గిపుల్ల వెలిగించినా, సిగరెట్టో, బీడినో విసిరినా.. మీ పరిస్థితి ఏంటి ” అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.