బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి సురేశ్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సురేశ్‌ని గమనించిన సహచరులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే సురేశ్ ముతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ప్రేమ విఫలం కావడమే సురేశ్ ఆత్మహత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. సురేశ్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లికి చెందినవాడిగా గుర్తించారు.
అయితే ఇటీవలి కాలంలో బాసర ట్రిపుల్ ఐటీ పలు కారణాల రీత్యా వార్తల్లో నిలవడం చూశాం. విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళనలు చేయడం చూశాం. దాదాపు 8 వేల మంది విద్యార్థులతో తెలంగాణలోని అతిపెద్ద విద్యార్థుల క్యాంపస్‌లలో ఒకటిగా నిలుస్తోంది. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు.. వసతులకు సంబంధం లేదంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థులు మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రులు సైతం ఆందోళనల్లో పాలు పంచుకున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా బాసర ట్రిపుల్ ఐటీ ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. అయితే ఒక కమిటీని నియమించి త్వరలోనే వారి సమస్యలను పరిష్కరిస్తామంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఆత్మహత్య ఘటన అందుకు సంబంధం ఉన్నది కాకపోయినా.. ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Basara IIIT student Suresh committed suicide in the hostel room, he was studying engineering first year.
Reasons for suicide are not known.
What is happening in Basara IIIT?@revanth_anumula @KotaNeelima @VenkatBalmoor #RGUKT pic.twitter.com/t3jdAi4wwj
— Nageshwar Rao (@itsmeKNR) August 23, 2022