ఇటీవల తెలంగాణలో అధికార పార్టీ వర్సెస్ బీజేపీకి మద్య మాటల యుద్దం నడుస్తుంది. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. ప్రజల్లోకి వెళ్లి అధికార పార్టీ పనితీరును ఎండగట్టేందుకు ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభమైన ప్రజా సంగ్రామ యాత్ర రోజూ ఉదయం, సాయంత్రం వరకు దాదాపు పదమూడు కిలో మీటర్ల మేర ఆయన ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆయన 100 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఆదివారం ఆయన తన యాత్ర ప్రారంభిచే సమయానికి తీవ్ర అస్వస్థతకు గురి కావడం జరిగింది. దీంతో కార్యకర్తలు, అభిమానులు కంగారు పడ్డారు.
బండి సంజయ్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ శరత్ వెంటనే వైద్య పరీక్షలు చేసి ఆయన వడదెబ్బ, ఎసిడిటీకి గురయ్యారని తెలిపారు. బండి సంజయ్ కోలుకునేంత వరకూ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ తెలిపారు. ఇప్పుడు ఆయన పరిస్థితి బాగుందని చెప్పారు. కొంత విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు సూచించానని అన్నారు. డాక్టర్ సూచన మేరకు బండి సంజయ్ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.