తెలంగాణ వ్యాప్తంగా ప్రశ్నా పత్రాల లీకేజ్ వ్యవహారం పెను సంచలనాలు సృష్టించింది. నిన్న టెన్త్ హిందీ పేపర్ లీకేజ్ కేసులో రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 1997 లోని సెక్షన్ 5 కింద కేసు నమోదు చేసినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు.
తెలంగాణలో టెన్త్ హిందీ ప్రశ్నా పత్రాల లీకేజ్ వ్యవహారం పెను సంచలనాలు సృష్టిస్తుంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ చేశారు పోలీసులు. బండి సంజయ్‌పై కమలాపూర్ పోలీసులు తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్, 1997 లోని సెక్షన్ 5 కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 120 బీ, సెక్షన్ 420 కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో బండి సంజయ్‌ను ఏ1గా చేర్చినట్లు వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ క్రమంలో బండి సంజయ్ ని పోలీసులు హన్మకొండ కోర్టు కి హాజరు పరిచారు.
ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత హన్మకొండ కోర్టు బండి సంజయ్ కి రిమాండ్ విధించింది. పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీక్ కేసులో బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నెల 19 వరకు ఆయనకు రిమాండ్ విధించగా.. ప్రస్తుతం బండి సంజయ్ ని ఖమ్మం జైలుకు తరలించనున్నారు. పేపర్ లీక్ కేసులో పోలీసుల వాదనతో ఏకీభవించిన జడ్జి సంజయ్ కి రిమాండ్ విధించడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిపోయింది.
బండి సంజయ్ అరెస్ట్ ఎఫ్ఐఆర్ కాపీ#BandiSanjayKumar #BandiSanjay #BandiSanjayArrest pic.twitter.com/oE5GonGmTO
— Telugu Scribe (@TeluguScribe) April 5, 2023