తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆయనను సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అవసరమైన పరీక్షలు నిర్వహించారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని పలువురు నేతలు ఆకాంక్షించారు. తాజాగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్వీట్ చేశాడు.
ఆయన త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా ఆకాంక్షించారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారి అనారోగ్య సమాచారం ఆందోళనకు గురిచేసింది. అమ్మవారి కృపతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు ఆయన.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.