తెలంగాణ వ్యాప్తంగా పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజ్ వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. నిన్న టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎఫ్ ఐఆర్ లో బండి సంజయ్ ని ఏ1గా చేర్చారు. ఆయనపై తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 1997 లోని సెక్షన్ 5 కింద కేసు నమోదు చేశారు.
తెలంగాణలో పదవ తరగతి హిందీ పరీక్ష పేపర్ లీక్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బండి సంజయ్ అరెస్ట్ విషయంపై వరంగల్ సీపీ రంగనాథ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు. టెన్త్ పేపర్ లీక్ విషయంలో బండి సంజయ్ ని ఏ1 గా ఉన్నారని పేర్కొన్నారు. ఎ3 గా మహేష్, ఎ 4 గా మైనర్ బాలుడిగా పేర్కొన్నారు. టెన్త్ పరీక్ష పత్రం లీక్ కేసులో తన నేరాన్ని అంగీకరించినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో టెన్త్ హిందీ పేపర్ లీకేజీ విషయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ కార్యకర్త ప్రశాంత్ కీలకంగా వ్యవహరించారని వరంగల్ సీపీ రంగనాత్ పేర్కొన్నారు. టెన్త్ పరీక్ష పత్రాన్ని ప్రశాంత్ వైరల్ చేశాడని తెలిపారు. ప్రశాంత్, మహేష్ లు కలిసి బండి సంజయ్ కి క్వచ్చన్ పేపర్ ని వాట్సాప్ లో పంపారని తెలిపారు. బండి సంజయ్ కి ప్రశ్నాపత్రం 11.24 గంటలకు చేరిందని.. అయితే ఉదయం 9.30 గంటలకే ప్రశ్నా పత్రం లీక్ అయినట్లు ప్రశాంత్ అసత్య ప్రచారం చేశారని తెలిపారు. అరెస్ట్ అయినపుడు తన వద్ద సెల్ ఫోన్ లేదని చెప్పాడని.. తనకు తెలిసిన వారికి ఈ ప్రశ్నాపత్రాన్ని షేర్ చేసినట్లుగా బండి సంజయ్ అంగీకరించినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు.
అన్ని విషయాలు ధృవీకరించుకున్న తర్వాత.. లోక్ సభ స్పీకర్ కి సమాచారం ఇచ్చి బండి సంజయ్ ని అరెస్ట్ చేశామని అన్నారు. ఇక పేపర్ లీక్ కు ముందు రోజు బండి సంజయ్, ప్రశాంత్ చాట్ చేసుకున్నారని.. 149 మందికి ఈ ప్రశ్నాపత్రాన్ని బండి సంజయ్ షేర్ చేశారన్నారు. ఈ చాట్ ఆధారంగానే బండి సంజయ్ ని A1గా చేర్చామని సీపీ రంగనాథ్ తెలిపారు. వీరిపై ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు. లీకేజీకి పాల్పడటమే కాకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలని విద్యార్థులను వారి తల్లిదండ్రులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయని సీపీ రంగనాథ్ పేర్కొన్నారు.