సాధారణంగా పారిశ్రామికవాడలక సమీపంలో ఉండే బస్తీల్లో దుర్వాసనలు భరించలేని విధంగా వస్తుంటాయి. రసాయినాల కలయిక వల్ల ఈ వాసనలు వస్తుంటాయి. ఈ మద్య కొన్ని కెమికల్ ఫ్యాక్టరీల సమీపలో దుర్గందాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
అసలే వేసవి కాలం.. భానుడు ప్రతాపంతో విపరీతమైన ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. చల్లదనం కోసం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వాడుతుంటారు.. కొంతమంది ఆరుబయట, మేడపై నిత్రపోతుంటారు. రాత్రి అందరూ ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో ఒక్కసారే ఘాటైన వాసనతో హైాదరాబాద్.. పాతబస్తీ జనాలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు.. ఆ ఘాటైన వాసన ఎక్కడ నుంచి వస్తుందో అర్థం కాక తెల్లవారు రోడ్లపైకి వచ్చి జాగారం చేశారు. కొంతమంది పిల్లలు వాసన భరించలేక వాంతులు చేసుకున్నారు.. పెద్దవాళ్లు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లోని పాతబస్తీలో కొన్ని ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి ప్రమాదకరమైన దుర్వాసన రావడంతో జనాలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. యూసుఫ్ నగర్, టప్పాచబుత్ర, కార్వాన్, నటరాజనగర్, మహేష్ కాలనీ తదితర ప్రాంతాల్లో అర్ధరాత్రి ఒక్కసారే విపరీతమైన ఘటు వాసన రావడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు రాత్రంతా రోడ్లపైనే జాగారం చేశారు. దాదాపు గంటన్నర పాటు ప్రజలు ఈ వాసనతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. దుర్వాసన ఆగిపోయిన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాసన ఎక్కడ నుంచి వస్తుందన్న విషయం పై డి.ఆర్.ఎఫ్ బృందం ఆరా తీశారు. ఎంత వెతికినా ఆ వాసన ఎక్కడ నుంచి వచ్చిందో అధికారులు గుర్తించలేపోయారు. దాదాపు గంటన్నర పాటు ఆ వాసన వచ్చిందని.. తర్వాత అదే ఆగిపోయిందని స్థానికులు తెలిపారు.
ప్రశాంతంగా పడుకునే సమయంలోనే దుర్వాసన రావడంతో చిన్న పిల్లలు ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు.. మహిళలు, పెద్ద వయసువాళ్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గతంలో ఈ తరహా ఘాటైన వాసనలు పారిశ్రామిక వాడలకు దగ్గరలో ఉన్న బాలానగర్, జీడిమెట్ల ప్రాంతాల్లో కొన్ని బస్తీల్లో వచ్చినట్లు వార్తలు వచ్చాయి. రసాయనాల వ్యర్థాల కలయిక వల్ల ఇలాంటి దుర్వాసనలు వెలువడుతుంటాయని అధికారులు అంటున్నారు. అయితే పాతబస్తీలో ఈ తరహా వాసనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.