గత కొంత కాలంగా అడవుల్లో ఉండాల్సిన కృర మృగాలు, సాదు జంతువులు పట్టణాలు, గ్రామాల్లోకి రావడం చూస్తునే ఉన్నాం. ఎక్కువగా చిరుత, పులి, ఎలుగు బంట్లు గ్రామాల్లో సంచరిస్తూ ఆవులు, మేకలపై దాడులు చేసి చంపేసి తింటున్నాయి. కొన్నిసార్లు ఇవి మనుషులపై కూడా దాడి చేసిన చంపిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీని ఆస్కార్ రేంజ్ కి తీసుకు వెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్రంలో రానా విలన్ గా నటించాడు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన బాహుబలి ఎన్నో సంచలనాలు సృష్టించింది. ప్రపంచ స్థాయిలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.. కలెక్షన్ల వర్షం కురిపించింది. భారత దేశంలో అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రాల్లో బాహుబలి ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలో రానా ఓ దున్నపోతుతో ఫైట్ చేసే సీన్ చిత్రాలనికి హైలెట్ గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా బాహుబలి దున్నపోతు రేంజ్ ఉన్న ఓ దున్నపోతు గ్రామంలో హల్ చల్ చేసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఖమ్మం జిల్లా రఘునాదపల్లిలో అడవి నుంచి తప్పిపోయి వచ్చింది ఓ దున్నపోతు. కొద్ది సేపు గ్రామంలో తిరిగి ఆ దున్నపోతుని చూసి వామ్మో ఇది బాహుబలి లో రానా ఫైట్ చేసిన దున్నపోతు రేంజ్ లో ఉందని గ్రామస్థులు అనుకున్నారు. అంతలోనే ఆ దున్న కాలుకు ప్రమాదం జరగడంతో దగ్గరలోని ఓ రైతు మిరప చేనులో కదలకుండా కూలబడిపోయింది. మిరప చేనులోకి వెళ్లిన కూలీలు మొదట ఆ దున్నను చూసి భయపడ్డారు. ఆ అడవి దున్నను పంపిచే యత్నం చేశారు.. కానీ అది అక్కడ నుంచి కదలకపోవడంతో గాయపడిందన్న విషయం తెలుసుకొని వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు అడవి దున్నకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కాలుకు కట్టు కట్టి మెరుగైన వైద్యం చేయించేందుకు తీసుకు వెళ్లారు.
ఇటీవల అడవుల్లో ఉండాల్సిన సాధు జంతువులు, కృర మృగాలు పట్టణాలకు, గ్రామాలకు రావడం చూస్తూనే ఉన్నాం. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే గ్రామాల్లో ఎక్కువగా చిరుత, ఎలుగు బంట్ల సంచారాలు ఎక్కువ అవుతున్నాయి. ఇవి పశువులు, కోళ్లపై దాడులు చేసి చంపేస్తున్నాయి. కొన్నిసార్లు మనుషులపై కూడా అటాక్ చేయడం చూస్తూనే ఉన్నాం. అడవుల్లో ఆహార కొరత ఏర్పడటం వల్లనే జంతువులు సమీప గ్రామాలకు వస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. తాజాగా ఈ దున్నకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడయాలో వైరల్ అవుతుంది.