కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్ లారీ, ఆటోని ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఆటో ముందు భాగం కంటైనర్‌లోకి దూసుకుపోవడంతో మృతదేహాల్ని కూడా బయటకు తీయలేనంతగా ఇరుక్కుపోయాయి.
ప్రమాదం ఎలా జరిగిందంటే..?
సమాచారం మేరకు.. మద్నూరు నుంచి బిచ్కుంద వైపు ఆటో.. జాతీయ రహదారిపై రాంగ్‌రూట్‌లో వెళ్తున్నది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి గుజరాత్ వైపు కంటైనర్ లారీ వెళ్తున్నది. రెండు వాహనాలు వేగంగా ఉండడంతో ఢీ కొట్టగానే ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. లారీ ముందుభాగంలోకి ఆటో చొచ్చుకువెళ్లింది. ప్రేమ సమయంలో ఆటోలో ఆరుగురు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదుగురు మృతదేహాలు మాత్రం బయటకు కనిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు. లారీ కింద ఇరుక్కుపోయిన ఆటోను బయటకు తీసేందుకు అధికారులు, స్థానికులు యత్నిస్తున్నారు.
ఆటో రాంగ్‌రూట్‌లో వేగంగా రావడం, అదే సమయంలో కంటైనర్ వేగంగా ఉండడంతో ప్రమాదం తీవ్రత అధికంగా ఉందని పోలీసులు తెలిపారు. అయితే, మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఆటో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందన్న విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు మృతులకు సంబంధించిన ఫోన్ల ద్వారా.. అందులో డయల్ చేసిన నంబర్ల ద్వారా మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఇది కూడా చదవండి: నా వల్ల కావడం లేదు.. కంటతడి పెట్టిస్తున్న యువతి మరణం!
ఇది కూడా చదవండి: బ్రేకింగ్: ఘోర ప్రమాదం.. 40 మందితో నదిలో పడిన బస్సు!