దేశంలో ఉగ్రవాద ఘటనలు జరిగిన ప్రతి సారీ వినిపించే పేరు హైదరాబాద్. అనేక సార్లు భాగ్యనగరంలో ఉగ్ర కదలికలు కనిపించాయి. తాజాగా మరోసారి హైదరాబాద్ లో ఉగ్రకదలికలు బయట పడ్డాయి. మధ్యప్రదేశ్ ఏటీఎస్ టీమ్ భారీ ఆపరేషన్ చేసింది.
దేశంలో ఉగ్రవాద ఘటనలు జరిగిన ప్రతి సారీ వినిపించే పేరు హైదరాబాద్. ఎన్నో సార్లు హైదరాబాద్ లో ఉగ్ర లింకులు బయపడ్డాయి. ఉగ్రవాద సంస్థలకు చెందిన సానుభూతిపరులు తరచూ హైదరాబాద్ లో పట్టుబడ్డుతుంటారు. ఎన్ఐఏ అధికారులు, పోలీసులు ఇప్పటికే పలువురు ఐసిస్ సానుభూతిపరులను అరెస్ట్ చేశారు. తాజాగా మరోసారి హైదరాబాద్ లో ఉగ్ర కదలికలు బయటపడ్డాయి. హైదరాబాద్ లో మధ్యప్రదేశ్ చెందిన ఏటీఎస్ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో మధ్యప్రదేశ్ కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) అధికారులు ఏకకాలంలో భూపాల్, హైదరాబాద్ లో భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో మొత్తం 16 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 11 మంది భూపాల్ కి చెందిన వారు కాగా , 5 మంది హైదరాబాద్ కు చెందిన వాళ్లుగా గుర్తించారు. ఈ ఆపరేషన్ కి తెలంగాణ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో సాయ సహకారాలు అందించారు. దీంతో వారందరిని చాకచక్యంగా ఏటీఎస్ అధికారులు పట్టుకున్నారు.
నిందితులందరూ 18 నెలల నుంచి హైదరాబాద్ లో మకాం ఉంటున్నారు. నిందితుల నుంచి ఎల్ట్రానికి డివైన్స్, డ్రాగర్స్, మొబైల్స్, ఇస్లామిక్ జీహాది సాహిత్యం, కత్తులను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. యువతను ఉగ్రవాదంవైపు మళ్లింపు చేయాలని టెర్రిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఐసిస్ సానుభూతిపరులు టచ్ లో ఉంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగానే భూపాల్, హైదరాబాద్ లో మకాం వేసినట్లు సమాచారం. అరెస్ట్ చేసిన వారిని పోలీసులు భూపాల్ కి తరలించారు.
హైదరాబాద్ లో పట్టుబడ్డ వాళ్లంతా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా ఏటీఎస్ అధికారులు గుర్తించారు. వారందరిని భోపాల్ కు తరలించారు. భోపాల్ లోని బాగ్ ఉమ్రావ్ దుల్హా, జవహర్ కాలనీ, బాగ్ ఫర్హత్ అఫ్జా ప్రాంతాల్లో నలుగురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని నాలుగు ప్రాంతాల్లో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నత చదువులు చదివిన యువకులే ఉగ్రవాద సంస్థతో లింకులు పెట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడ్డ వారికి హిజృ ఉత్ తహ్రీర్ సంస్థతో లింకులున్నట్లు పోలీసులు గుర్తించారు.