ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ దర్శనమిస్తుంది. ఫోన్ అనేది మన నిత్య జీవితాల్లో ఓ భాగం అయిపోయింది. ఇక ఫోన్ వాడకంలో యువత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్ పక్కనే ఉండాలి. ఆఖరికి చార్జింగ్ పెట్టి మరి వాడుతుంటారు. అలా చేయడం చాలా ప్రమాదం అని హెచ్చరించినా వినరు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి శంకర్ పల్లి మండలంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: అప్పుడు ‘కచ్చాబాదం’.. ఇప్పుడు ‘జింగిల్’ వీడియో వైరల్
అస్సాం రాష్ట్రానికి చెందిన భాస్కర్ జ్యోతినాథ్ అనే 20 ఏళ్ల యువకుడు బతుకుదెరువు నిమిత్తం రెండేళ్ల క్రితం శంకర్‌పల్లికి వచ్చాడు. ఎలక్ట్రిషియన్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గదిలో ఫోన్ చార్జింగ్ పెట్టి.. అలానే ఫోన్‌లో మాట్లాడుతుండగా.. షాక్ తగిలి.. ఒక్కసారిగా అది పేలింది. ఈ ఘటనలో భాస్కర్ చేతులు, చెవుల భాగం కాలిపోయింది. విషయం తెలిసిన స్నేహితులు.. భాస్కర్‌ని శంకర్‌పల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: వారెవ్వా.. నెత్తిమీద గడ్డిమోపుతో సైకిల్ పై దూసుకెళ్లిన కుర్రాడు.. వీడియో వైరల్