మాతృత్వంలోని మాధుర్యాన్ని అనుభవించడం కోసం ప్రతి స్త్రీ పరితపించిపోతుంది. తాను మరణించి అయినా సరే బిడ్డకు జన్మనివ్వాలని భావిస్తుంది. పురిటి నొప్పులు స్త్రీకి పునర్జన్మ అంటారు. ఆ సమయంలో స్త్రీలు భరించే వేదనను వర్ణించడానికి మాటలు చాలవు. అనుభవిస్తే.. కానీ ఆ బాధ అర్థం కాదు. అయినా సరే.. వాటన్నింటిని భరించి మరీ బిడ్డకు జన్మనిస్తుంది స్త్రీ. ఇక బిడ్డ పుట్టిన తర్వాత ఆ మహిళ ఎంత బలహీనంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆపరేషన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన వాళ్లైతే నెల రోజులు మంచం దిగరు. నార్మల్ డెలివరీ వాళ్లు కోలుకోవడానికి వారం పది రోజుల సమయం పడుతుంది. ఇక బాలింత విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
ఇది కూడా చదవండి: Guntur: AP బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో సంచలన తీర్పు!
ఇక డెలివరీ తర్వాత అడుగు తీసి అడుగు వేయటమే కష్టంగా ఉంటుంది. అలాంటిది పది కిలోమీటర్లు నడక అంటే మాటలా.. అది కూడా ఎర్రటి ఎండలో.. చంటి బిడ్డను తీసుకుని.. ఇలా చదువుతుంటేనే.. గుండెలో మెలిపెట్టిన బాధ. ఇక అనుభవించే వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలా. ఇదే పరిస్థితి ఎదురయ్యింది ఓ పచ్చిబాలింతకు. ఎర్రటి ఎండలో పది కిలోమీటర్ల దూరం.. బిడ్డను తీసుకుని కాలినడకన ప్రయాణం చేసింది. ఆ హృదయవిదారక సంఘటన వివరాలు..
ఇది కూడా చదవండి: Rare Planet Alignment: అంతరిక్షంలో అద్భుతం.. మళ్లీ 1000 ఏళ్ల తర్వాతే ఇలా జరుగుతుందట!
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గోవెన నాయకపుగూడకి చెందిన నాగమ్మ ప్రసవం కోసం నిర్మల్ జిల్లాలోని పుట్టింటికి వెళ్లింది. ఐదు రోజుల కిందట ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమె మెట్టినింటికి వెళ్లేందుకు బయలుదేరింది. నిర్మల్ నుంచి ఆసిఫాబాద్.. అక్కడి నుంచి బలాన్‌పూర్ వరకు వాహనంలో వచ్చింది. అక్కడి నుంచి గోవెన నాయకపుగూడకి పది కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Love Marriage: పదేళ్ల క్రితం విడిపోయిన ప్రేమికులు.. ఇప్పుడు ‘మళ్లీ’ పెళ్లి చేసుకున్నారు!
ఈ మార్గం మధ్యలో రెండు చిన్నపాటి కొండలు, వాగులు దాటాలి. గతేదాడి ఈ ప్రాంతంలో పోలీసులు-మీ కోసం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వేసిన రోడ్డు వర్షాల కారణంగా కోతకు గురై అధ్వానంగా మారింది. ఈ మార్గంలో బైక్ మీద వెళ్లేందుకు కూడా ఇబ్బందే. ఇక చేసేది లేక బంధువు సాయంతో పచ్చి బాలింత అయిన నాగమ్మ.. బిడ్డను ఎత్తుకుని పది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లింది. ప్రస్తుతం ఈ సంఘటన రాష్ట్రావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారు తెలంగాణ అనే నాయకులకు ఇలాంటి కష్టాలు ఎందుకు కనిపించవు అని విమర్శిస్తున్నారు నెటిజనులు. మరి ఈ హృదయవిదారక సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.