మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రమాద సమయంలో కాలర్ బోన్ ఫ్యాక్చర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా వైద్యులు సాయిధరమ్ తేజ్ కాలర్ బోన్‌కు సర్జరీ చేశారు. శస్త్ర చికిత్స విజయం వంతం అయినట్లు డాక్టర్ అలోక్ రంజన్ అండ్ టీమ్ ప్రకటించారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. మరో 24 గంటలు అబ్జర్వేషన్‌లోనే ఉంచనున్నట్లు తెలిపారు. ప్రమాదంలో తేజ్‌కు కాలర్ బోన్ ఫ్యాక్చర్ మినహా పెద్దగా గాయాలు కాలేదు. హెడ్, స్పైన్ ఇంజురీలు కూడా లేవని తెలిపారు. శరీరంలో లోపల కూడా ఎలాంటి రక్త స్రావం జరగలేదని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 10న రాత్రి 8 గంటల 5 సెకన్ల సమయంలో సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో తేజ్ బైక్ 75 కిలోమీటర్ల వేగంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డుపై ఇసుక ఉండటం, వేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అటు రోడ్డు నీట్‌గా లేకపోవడంపై బాధ్యులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మెగా అభిమానులు భయపడాల్సింది ఏమీ లేదని మెగాస్టార్ తెలిపారు. వైద్యులు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ తారలు ఆకాంక్షిస్తున్నారు.