రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్‌సీ పశ్నాపత్రాల లీకేజీ ఘటనలో తవ్వేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేపర్ లీకేజీ సూత్రధారి రేణుక, తన అందాన్ని పావుగా వాడుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఆ మాయలో పడే ప్రవీణ్ ఆమె కోసమే ఇదంతా చేశాడని తెలుస్తోంది. అలాగే, తాజాగా పోలీసుల దర్యాప్తులో మరో కీలక విషయం బయటపడింది. టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీరస్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష ప్రశ్నపత్రాలు మాత్రమే కాకుండా మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీరింగ్ క్వశ్చన్ పేపర్ కూడా లీకైనట్లు పోలీసులు గుర్తించారు. పరీక్షకు రెండు రోజుల ముందే ప్రశ్నాపత్రం లీకైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్‌సీ పశ్నాపత్రాల లీకేజీ ఘటనలో తవ్వేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట కంప్యూటర్ హ్యాక్ అయిందని ప్రచారం చేసినప్పటికీ, ఉద్దేశ్యపూర్వకంగానే ఈ పేపర్ లీక్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. హనీ ట్రాప్ తో ఇది జరిగినట్లు స్పష్టం చేశారు. టీఎస్‌పీఎస్‌సీలో సెక్రటరీగా విధులు నిర్వహిస్తోన్నన్న ఒక వ్యక్తికి పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్ ఇందుకు ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు. మహబూబ్ నగర్ జిల్లా పగిడ్యాల్ పంచగల్ తండాకు చెందిన రేణుక అనే యువతి తన అందాన్ని పావుగా వాడుకొని ప్రవీణ్ నుంచి పేపర్ తెప్పించుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
మొదట కంప్యూటర్ హ్యాక్ కావడంతో పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని చెప్పడంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేపట్టారు. కానీ, విచారణలో కంప్యూటర్ హ్యాక్ కాలేదని, ఇందులో ఇంటి దొంగల హస్తం ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు. ఆపై ఉద్యోగులను విచారించగా ఆడ్మిన్ విభాగంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ఉద్యోగి రాజశేఖర్ ను ప్రవీణ్ ప్రశ్నాపత్రం గురించి ఆరాతీసిన విషయం వెలుగులోకి వచ్చింది. సెక్షన్ ఆఫీసర్ సిస్టమ్ లో ప్రశ్నాపత్రం ఉంటుందని తెలుసుకున్న ప్రవీణ్.. ఐడీ, పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ అయి క్షణాల్లో పని కానిచ్చేశాడు. మొబైల్ లో ఫోటోలు తీసుకొని.. యువతికి వాట్సాప్ చేశాడు.
ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కుంటున్న రేణుక అనే యువతి తన అందాన్నే పావుగా వాడుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. పేపర్ లీక్ చేస్తే, నీకోసం ఏది కావాలన్నా చేస్తా.. అని రేణుక, ప్రవీణ్ కు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఆ మాయలో పడ్డ ప్రవీణ్, ఆమె కోసమే ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. మొదట యువతి తన తమ్ముడి కోసమే ఇదంతా చేసిందని.. ప్రవీణ్ చెబుతుంటే.. ఆమెమాత్రం అత్యాశతో మరో అడుగు ముందుకేసి పేపర్‌ని బేరానికి పెట్టింది. అభ్యర్థులకు ఒక్కొక్కరికి పేపర్‌ని రూ.14లక్షలకు బేరానికి పెట్టింది. ఈ మాట ఆనోటా.. ఈనోటా పడడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
ఈ కేసులో ఇప్పటికే 11 మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన నిందితుడు ప్రవీణ్తో సహా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్, పేపర్ లీకేజీ సూత్రధారి రేణుక, ఆమె భర్త, సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే పేపర్ కొనుగోలు చేసిన ముగ్గురు అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే, తాజాగా పోలీసుల దర్యాప్తులో మరో కీలక విషయం బయటపడింది. టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీరస్(మార్చి 12), వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష(మార్చి 15, 16 తేదీల్లో) జరగాల్సిన ప్రశ్నపత్రాలు మాత్రమే కాకుండా మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీరింగ్ క్వశ్చన్ పేపర్ కూడా లీకైనట్లు పోలీసులు గుర్తించారు. పరీక్షకు రెండు రోజుల ముందే ప్రశ్నాపత్రం లీకైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఆ పరీక్షను రద్దు చేసే దిశగా టీఎస్‌పీఎస్‌సీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై… మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
TSPSC ఎగ్జామ్ పేపర్ లీక్ కారణమైన, హనీ ట్రాప్ చేసిన నార్త్ ఇండియా లేడీ రేణుకను అరెస్ట్ చేసిన పోలీసులు. pic.twitter.com/Vz9ROrQ4rD
— Telugu Scribe (@TeluguScribe) March 13, 2023