హైదరాబాద్‌కు ఖంగు తినే వార్త మరొకటి రెక్కలు కట్టుకుని వస్తోంది. ఇక భాగ్యనగరానికి మరో ముప్పు దూసుకొస్తోందా..? ఇప్పటికే కరోనాతో భయంగా గడుతున్న తరుణంలో మరో ముప్పేంటనే అనుకుంటున్నారా..? అవును మీరు విన్నది నిజమే. హైదరాబాద్ నగరానికి మరో ముప్పు రానుందని శాస్త్రవేత్తలు గొంతులు విరుచుకుని మరి చెబుతున్నారు. అసలు ఏంటా ముప్పు..? ప్రకృతి విపత్తా..? లేక మరేంటి..? ఇదిగో అసలు నిజాలు.
ఇక ఇలాంటి ప్రశ్నలకు నేషనల్ జియో ఫిజికల్ ఇనిస్టిట్యూట్ సమాధానలతో పాటు హెచ్చరికలు జారీ చేస్తోంది. నగరంలో ఎన్నో రోజుల నుంచి మట్టి వాసన రుచి మారటంతో మట్టిలో విషమూలికలు దూరిపోయాయని, వాతావరణ కాలుష్యం కూడా అధికమవటంతో ప్రకృతి కూడా అనుకూలించటంలేదని తెలిపింది. హైదరాబాద్ అంతా వాయు కాలుష్యం పెరిగిపోవటంతో గాలి, వాతావరణం, మట్టి అంతా విషమూలికలతో నిండిపోయిందని ప్రకటించింది. దీంతో పాటు పచ్చని చెట్లు, చెరువులు లేక ఎంతో విశతపూరితమైన గాలితో నిండిపోయిందని పర్యావరణ వేత్తలు మొత్తుకుంటున్నారు.
మట్టి విషయానికొస్తే మొక్కలు నాటితే అవి ఎదిగే పరిస్థితి లేకుండా పోయిందని తెలుపుతున్నారు. ఇక ఒక వైపు అభివృద్ధి అంటూ పరుగులు పెడుతూ ప్రభుత్వాలు, ప్రజలు పర్యావరణాన్ని పట్టించుకునే స్థాయిలో లేరని పర్యావరణ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ఇక పదేళ్ల కాలంలోనే వాతావరణంలో ఇంతటి విషపూరిత మార్పులు సంభవించాయని, ఇక నుంచైనా జాగ్రత్తలు పాటించకుంటే హైదరాబాద్ వాసులు మరో ముప్పును ఎదుర్కోక తప్పదని శాస్త్రవేత్తలు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.