గత కొన్ని రోజుల నుంచి భారీగా మండిపోతున్న ఇంధన ధరలకే ప్రజలు తట్టకోలేకపోతున్నారు. పెట్రల్, డీజిల్ రెట్లు రోజు రోజుకు భారీగా పెరుగుతున్న క్రమంలోనే గ్యాస్ వినియోగదారులకు మరో షాక్ ఎదురైంది. తాజాగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై 25, కమర్షియల్ సిలిండర్‌పై 75 పెంచుతు నిర్ణయం తీసుకోవటం విశేషం. ఇక ఈ ఏడాది ప్రారంభంలో గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.694గా ఉండగా నేడు మాత్రం ఆ ధర రూ.884కు పెరిగి సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. కాగా తాజాగా పెరిగిన ధరలతో పోల్చుకున్నట్లైతే గ్యాస్ సిలిండర్ ఇంటికి చేరుకునే సరికి రూ.1000 వరకు భారం పడునుందని తెలుస్తోంది.
హైదరాబాద్‌లో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.912 ఉండగా, ఢిల్లీలో మాత్రం గ్యాస్ సిలిండర్ ధర రూ.884 గా ఉంది. ఇక ఇక్కడే కాకుండా కోల్‌కతాలో రూ.886.50, ముంబైలో రూ.859.50 ధరలు ఉండటం విశేషం. కాగా తాజాగా పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి.