ప్రజాప్రతినిధులు.. తమ అధికారాన్ని చూసుకుని ప్రభుత్వ అధికారులు, పోలీసులపై రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తమని ఎవరు ఏమి చేయలేరులే అనే ధోరణిలో ఉంటున్నారు. రాజకీయ నేతలు అధికారులను బెదిరించే ఘటనలు నిత్యం అనేకం చూస్తున్నాం. ఏదైన సమస్య ఉంటే అధికారులతో సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకోవాలి. కానీ రెచ్చిపోయి మాట్లాడటమే సరైనది అనే విధానంలో కొందరు నేతలు ఉన్నారు. ఇటీవల పోలీసులపై భోలక్ పూర్ ఎంఐఎం కార్పొరేటర్ రెచ్చిపోయి మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఎంఐఎం కార్పొరేటర్ పోలీసులపై రూబాబు చూపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
బుధవారం అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని ఉన్న యునాని ఆసుపత్రి ఎదుట భారీగా పార్కింగ్ చేయడంతో స్థానికులు 100కు కాల్ చేశారు. దీంతో ఎస్సై రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు అక్కడి వెళ్లారు. ఇంతలో స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ సయ్యద్ సోహైల్ ఖాద్రి అక్కడి వచ్చారు. అసలు మీకు ఇక్కడ ఏం పని.. ఎందుకొచ్చారంటూ ఎస్సై పై నిప్పులు చెరిగారు. తమకు ఫిర్యాదు అందడంతో ఇక్కడి వచ్చామని పోలీసులు తెలిపారు. అయినా వారి మాటలు కార్పొరేటర్ వినిపించుకోలేదు. అదే సమయంలో పోలీసులకు యునాని హాస్పిటల్ సిబ్బంది ఫోన్ చేశారని తెలిసి ఆసుపత్రి సిబ్బందిపై కూడా ఈ కార్పొరేటర్ సీరియస్ అయ్యారు. గట్టి గట్టిగా అరుస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ అధికారం ఇక్కడ చూపిస్తామంటే నడవదని హెచ్చరించారు. ఇక్కడ ఇలాగే చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.ఇది రంజాన్ నెల కావడంతో రోజూ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ప్రార్ధనకు వచ్చేవారికి పార్కింగ్‌ను యునాని హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తుంటారు. ఈసారి అలా చేయలేదు. యునాని హాస్పిటల్ గేట్లు మూశారు. ప్రార్థనలకు వచ్చిన వాళ్లంతా ఆస్పత్రి గేటు ముందు, రోడ్లపై వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ భారీగా ఆగిపోయింది. ఇదే సమయంలో స్థానికుల ద్వారా ఫిర్యాదు అందుకున్న ఎస్సై అక్కడి వెళ్లారు. ఈ సమయంలోనే ఫిర్యాదు అందుకున్న ఎస్సై అక్కడికి రావడం, అదే సమయంలో కార్పొరేటర్ సయ్యద్ సొహైల్ ఖాద్రి రావడంతో తాజా ఘటన చోటు చేసుకుంది. ఏదైన ఇబ్బందులు ఉంటే సున్నితం చెప్పాలే కానీ.. సదరు కార్పొరేటర్ ఇలా ప్రవర్తించటం ఏమిటని కొందరు అభిప్రాయాపడుతున్నారు. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.