చిన్నారులను ఇంటి నుంచి తీసుకురావడంతో పాటు వారిని ఇంటికి సురక్షితంగా చేర్చే భాద్యత.. అంగన్వాడి సిబ్బందిది. అందుకోసం అంగన్వాడీ టీచర్ తో పాటు ఆమెకు ఒక సహాయకురాలని సైతం ప్రభుత్వం నియమించింది. అయినప్పటికీ, అంగన్వాడి సిబ్బంది తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సంఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. తాజాగా వెలుగుచూసిన ఒక సంఘటన చూస్తే.. వారు విధుల పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది.
చిన్నారులను ఇంటి నుంచి తీసుకురావడంతో పాటు వారిని ఇంటికి సురక్షితంగా చేర్చే భాద్యత.. అంగన్వాడి సిబ్బందిది. అందుకోసం అంగన్వాడీ టీచర్ తో పాటు ఆమెకు ఒక సహాయకురాలని సైతం ప్రభుత్వం నియమించింది. అయినప్పటికీ, అంగన్వాడి సిబ్బంది తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సంఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. తీసుకొచ్చి తిండిపెట్టడం, అక్షరాలు బోధించే వరకు అన్నీ సజావుగా సాగినా, తీసుకెళ్లేటపుడు మాత్రం వారిని విస్మరిస్తున్నారు. తాజాగా వెలుగుచూసిన ఒక సంఘటన చూస్తే.. వారు విధుల పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది.
రెండున్నరేళ్ళ చిన్నారిని ఇంటి నుంచి తీసుకొచ్చిన అంగన్వాడి సిబ్బంది, తిరిగి ఆ చిన్నారిని ఇంటికి చేర్చడం మానేసి.. స్కూల్లో పెట్టి తాళం వేశారు. లోపల పెట్టి తాళం వేయడంతో భయపడిపోయిన ఆ చిన్నారి గుక్కపట్టి ఏడుస్తూ.. చివరకి స్పృహ తప్పి పడిపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. జిన్నారం మండలం కాజిపల్లి గ్రామానికి చెందిన రెండున్నరేళ్ళ చిన్నారి అవంతికను సిబ్బంది ఉదయాన్నే అంగన్వాడి కేంద్రానికి తీసుకొచ్చారు. అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు పాప ప్రతి రోజు ఇంటికి చేరేది. కానీ రెండ్రోజుల క్రితం అలా ఇంటికి చేరలేదు. సాయంత్రం 4 అవుతున్న ఇంటికి రాకపోవడంతో, ఖంగారుపడ్డ తల్లిదండ్రులు అంగన్వాడి సిబ్బందిని ప్రశ్నించారు.
వారేమో మీ పాప మద్యాహ్నమే ఇంటికొచ్చింది.. ఆ తరువాత ఏం జరిగిందో మాకు తెలియదంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు చుట్టుప్రక్కల ఇళ్లు, బావులు అన్నింటా వెతికారు. అయినప్పటికీ, ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలు పర్యవేక్షించగా అంగన్వాడి కేంద్రం నుంచి పాప బయటికి రానట్టుగా గుర్తించారు. అనుమానంతో తిరిగి అంగన్వాడి కేంద్రానికి వెళ్లి తాళం తీసి చూడగా పాప ఒక మూలన పడి ఉంది. సుమారు ఏడెనిమిది గంటల పాటు అంగన్వాడి కేంద్రంలో ఉన్న చిన్నారి భయంతో ఏడ్చి.. ఏడ్చి.. స్ఫృహ తప్పి పడిపోయింది. వెంటనే తల్లిదండ్రులు సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఈ ఘటన రెండ్రోజుల క్రితం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.