ఏదైనా ఊహించని ప్రమాదం జరిగితే ఆపత్కాలంలో ఆదుకునే వాహనం అంబులెన్స్. సకాలంలో చేరుకుని అనేక మంది ప్రాణాలను నిలబెడుతుంది. అటువంటి వాహనానికే ప్రమాదం జరిగితే.. అందులో మనుషులు ఉంటే.. పరిస్థితి ఊహించడానికే భయం కలుగుతోంది. కానీ
మీరు రోడ్డుపై వెళుతున్నారు.. ఆ రోడ్డు నుండి ఆ వైపుకు వెళ్లాలంటే సిగ్నల్స్ చూసుకుని దాటుతారు. రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఏ వాహనమైనా, మనిషైనా ఆగిపోవాల్సిందే. కానీ ఒకే ఒక్క వాహనానికి సిగ్నల్స్‌తో పనిలేదు. రయ్ రయ్ అంటూ సైరన్ వేసుకుంటూ దూసుకెళుతుంది. అదే అంబులెన్స్. ప్రమాదంలో ఉన్న వ్యక్తులను త్వరిగతిన సమీపంలోని ఆసుపత్రులకు తీసుకెళ్లడమే అంబులెన్స్ విధి. ఎన్నో ప్రాణాలను కాపాడే అంబులెన్స్ ప్రమాదానికి గురైతే..వినడానికే ఆశ్చర్యంగా అనిపించినా.. నిజంగానే జరిగింది. ఓ అంబులెన్స్ అదుపు తప్పి వాగులో బోల్తా పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
మృతదేహాన్ని తీసుకెళుతున్న ఓ అంబులెన్స్ అదుపు తప్పి వాగులో బోల్తాపడిన ఘటన జైనథ్ మండలంలో చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే
తరోడ వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో ఓ ప్రత్యేక రహదారి సౌకర్యం కల్పించారు. కాగా.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు జైనథ్ వైపు నుంచి గురువారం ఓ అంబులెన్స్ వెళ్తోంది. అందులో ఓ మృతదేహంతో పాటు నలుగురు వ్యక్తులున్నారు. అయితే వీరు ప్రయాణిస్తున్న అంబులెన్స్ తరోడ వద్ద అదుపు తప్పి వాగులో బోల్తా పడింది. గమనించిన స్థానికులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టారు. అంబులెన్స్‌లో చిక్కుకుపోయిన నలుగురిని మొదట బయటకు తీశారు. అనంతరం తాళ్ల సాయంతో అంబులెన్స్ ను పైకి లేపి, అందులోని మహిళ మృతదేహాన్ని కూడా వెలికి తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.