గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సినీ, రాజకీయ నేతలే కాదు పలు రంగాల్లోని ప్రముఖులు కన్నుమూశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి,మహిళా జె ఏ సి లో చురుకైన పాత్ర పోషించి, ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి అమ్మల సంఘం అధ్యక్షురాలు.. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ మంగళవారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి నేడు మృతి చెందారు.
ఇది చదవండి: పనిమనుషులకి కోట్ల విలువైన షేర్స్ దానం చేసిన CEO!
అల్లం నారాయణ సతీమణి పద్మ కన్నుమూసిన విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె చేసిన సేవలు గుర్తుకు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అల్లం నారాయణను ఫోన్లో పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా అల్లం పద్మ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం బుధవారం ఉదయం ఎర్రగడ్డ జేక్ కాలనీ లోని ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ రోడ్ నెంబర్ 1 వద్ద ఉంచనున్నారు. అప్పటివరకు మృతదేహం నిమ్స్ ఆసుపత్రి లో ఉంటుంది.
అల్లం పద్మ మృతికి మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్ సంతాపం తెలిపారు. అల్లం పద్మ మరణం పట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ ఆన్ లైన్ వర్కింగ్ జర్నలిస్ట్స్ -TUOWJ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అల్లం నారాయణ ‘జైబోలో తెలంగాణ’ చిత్రంలో ఒక ముఖ్యపాత్రలో నటించిన విషయం తెలిసిందే. అల్లం పద్మ మృతి పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.