ఈడీ విచారణ నిమిత్తం ఢిల్లీ వెళ్లిన కవిత.. దాదాపు 9 గంటల తర్వాత ఈడీ ఆఫీస్ నుంచి బయటకొచ్చింది. ఈనెల 16న మరోసారి విచారణ రావాలని అధికారులు ఆదేశించారు. దీంతో కవితతోపాటు కేటీఆర్, హరీశ్ రావు కూడా కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్ MLC కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ పూర్తయింది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రశ్నించిన ప్రారంభించిన అధికారులు.. దాదాపు 9 గంటల పాటు విచారించారు. ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో ఉన్న కేటీఆర్, హరీష్ రావుతోపాటు కవిత కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు అలెర్ట్ అయిపోతున్నాయి. సాయంత్రం ఐదున్నరకే విచారణ ముగిసిపోవాల్సి ఉండగా.. సడన్ గా ఆ టైంని అధికారులు పెంచేశారు. రూల్స్ ప్రకారం సాయంత్రం 6 వరకే విచారించాల్సి ఉన్నప్పటికీ, సమయం దాటిపోయినా సరే కవితని బయటకు పంపలేదు.
ఇక విషయానికొస్తే.. ఈడీ అధికారుల తీరుతో బీఆర్ఎస్ శ్రేణులు తెగ ఆందోళన పడ్డాయి. అయితే దాదాపు 9 గంటల విచారణ తర్వాత కవిత విచారణకు రావడంతో సంతోషంగా ఫీలయ్యారు. ఈడీ కార్యాలయం దగ్గర పోలీసులు హై అలెర్ట్ ప్రకటించడం, మీడియాతోపాటు బీఆర్ఎస్ శ్రేణుల్ని దగ్గర లేకుండా దూరంగా పంపించేశారు. దీంతో కవిత బయటకు రాగానే అరెస్ట్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. విచారణలో భాగంగా PMLA సెక్షన్ 50 కింద కవితని ప్రశ్నించిన అధికారులు, స్టేట్ మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న కవిత ఫోన్ ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.