అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన నవీన్ దారుణ హత్యతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తన అన్నను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని నవీన్ తమ్ముడు డిమాండ్ చేస్తున్నాడు. తన అన్న నవీన్ హత్యలో ఒక్కరి ప్రమేయమే కాకుండా ముగ్గురి, నలుగురి ప్రమేయం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అబ్దుల్లాపూర్ మెట్ లో చోటు చేసుకున్న నవీన్ దారుణ హత్యతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్నేహితుడు నవీన్ ని నమ్మించి అత్యంత పాశవికంగా హత్య చేశాడు హరిహరకృష్ణ. తాను ప్రేమించిన అమ్మాయితో మాట్లాడుతున్నాడు అనే కారణంతో, కోపంతో.. నవీన్ ను దారుణంగా హత్య చేశాడు. నవీన్ తలా, మెుండెం వేరు చేసి, గుండెను సైతం చీల్చి బయటకు తీసి అత్యంత దారుణంగా చంపాడు. ఇక తన అన్నను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని నవీన్ తమ్ముడు డిమాండ్ చేస్తున్నాడు. తన అన్న నవీన్ హత్యలో ఒక్కరి ప్రమేయమే కాకుండా ముగ్గురి, నలుగురి ప్రమేయం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
బీటెక్ విద్యార్థి నవీన్ హత్యతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలు దిగ్భ్రాంతి చెందాయి. తాను ప్రేమిస్తున్న అమ్మాయితో మాట్లాడుతున్నాడని స్నేహితుడు నవీన్ ను అత్యంత దారుణంగా చంపాడు హరిహరకృష్ణ అనే యువకుడు. నవీన్ హత్యపై సంచలన వ్యాఖ్యలు చేశాడు నవీన్ తమ్ముడు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవీన్ తమ్ముడు ఈ విధంగా మాట్లాడాడు. “మా అన్నను చంపడానికి ఆమె గత నెల 17వ తారీఖునే ప్లాన్ వేసింది. కానీ మా అన్న హైదరాబాద్ కు వెళ్ళలేదు. ఇక మా అన్న ఆమెను ఇంటర్ లో ఉన్నప్పుడు ప్రేమించాడు. కానీ గత నాలుగు సంవత్సరాలుగా ఆమెను బ్లాక్ లిస్ట్ లో పెట్టి.. దూరంగా ఉంటున్నాడు. దాంతో తట్టుకోలేకపోయిన ఆమె మా అన్నను టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసింది. అదీకాక ఆమె ప్లాన్ లో భాగంగానే హరిహరకృష్ణతో మా అన్నను దారుణంగా చంపించింది” అని నవీన్ తమ్ముడు చెప్పుకొచ్చాడు.
ఇక తన అన్నను హత్య చేసింది ఒక్కడు కాదు అని, దీని వెనుక ముగ్గురు, నలుగురు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు నవీన్ తమ్ముడు. వారందరకి శిక్షపడాలని డిమాండ్ చేశాడు. ముఖ్యంగా మా అన్న చావుకు కారణం అయిన ఆమెను కఠినంగా శిక్షించాలని అతడు కోరాడు. లేకపోతే అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటాను అని నవీన్ తమ్ముడు హెచ్చరించాడు. మరి ఇతడు ఆరోపించినట్లుగా ఆ మిగతావారు ఎవరు? అన్న అనుమానం జనాల్లో రేకెత్తుతోంది. హరిహర తండ్రి సైతం నవీన్ హత్య తన కొడుకు ఒక్కడే చేసి ఉండడు అని దీని వెనకాల ఎవరో ఉన్నారని చెప్పుకొచ్చాడు. దాంతో నవీన్ తమ్ముడు చేసిన ఆరోపణలు కూడా ఇప్పుడు ఆనుమానాలను రేకెత్తిస్తున్నాయి.