ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులకు ఆసరాగా నిలుద్దామని విదేశాలకు వెళుతున్నారు భారతీయులు. అయితే జాతి వివక్షకు గురికావడమో, లేదంటే రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, విహార యాత్రల సమయాల్లో అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాాజగా మరో తెలుగు తేజం నేలరాలింది.
ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం సంపాదించి కన్నోళ్లకు చేదోడు, వాదోడుగా ఉందామనే ఉద్దేశంలో విదేశాలకు పయనమవుతున్నారు భారతీయులు. విదేశాల్లో చదువుకుంటున్న సమయాల్లో జాతి వివక్షకు గురికావడమో, లేదంటే రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, విహార యాత్రల సమయాల్లో అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చి.. అనంత లోకాలకు తిరిగి వెళుతున్నారు. ఇటీవల కాలంలో విదేశాల్లో అనేక మంది భారతీయులు ముఖ్యంగా తెలుగు విద్యార్థులు చనిపోతున్న సంగతి విదితమే. మొన్నటికి మొన్న ఓ అమ్మాయి రోడ్డు దాటుతుండగా.. ప్రమాదానికి గురై చనిపోగా.. ఓ విద్యార్థిని గుండె పోటుతో మరణించింది. సరస్సులో పడి బాపట్లకు చెందిన విద్యార్థి కన్నుమూశాడు. తాజాగా మరో విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.
హైదరాబాద్ కు చెందిన సాయి తేజస్వి కొమ్మారెడ్డి బ్రిటన్‌లోని క్రాన్‌ఫీల్డ్ యూనివర్శిటీలో ఏరోనాటిక్స్, స్పేస్ ఇంజనీరింగ్ మాస్టర్స్ చేస్తోంది. ఈ నెల 11న బ్రైటన్ బీచ్‌కు వెళ్లగా ఆమె గల్లంతు అయ్యింది. కాగా, అధికారులు ఆమె మృతదేహాన్ని వెలికి తీశారు. యుకెలోని ఆసుపత్రిలో ఉంచారు. స్వస్థలానికి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మృతురాలి సోదరి ప్రియారెడ్డి మంత్రి కేటీఆర్‌కు ఓ ట్వీట్ చేసింది. ‘తన అక్క యూకేలో మరణించింది, ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు మా కుటుంబం అనేక సవాళ్లు ఎదుర్కొంటుంది. దయచేసి తన సోదరి అంత్యక్రియలు స్థానికంగా చేసేందుకు సహాయం చేయండి’ అంటూ ట్వీట్ చేసింది.
ప్రియారెడ్డి ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. మీకు జరిగిన నష్టానికి చాలా చింతిస్తున్నాము. నా బృందం వెంటనే సహాయం చేయడానికి స్థానిక బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ బృందంతో కలిసి పనిచేస్తుంది. వీలైనంత త్వరగా మీకు సహాయం అందిస్తామని హామీనిచ్చారు. ఇదిలా ఉంటే తేజస్వీ బంధువు ప్రదీప్ రెడ్డి స్పందిస్తూ.. సాయి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడం చాలా కష్టమైన ప్రక్రియ అని, ఆర్థికంగా సవాలు ఉందని అన్నారు. స్వదేశానికి ఆమె మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఆర్థిక సహాయం కోరుతున్నామని, ఈ క్రమంలో క్రౌడ్ ఫండింగ్ పేజీని ప్రారంభించామని తెలిపారు.
Very sorry for your loss
My team @KTRoffice will work with local British Deputy High Commissioner’s team @UKinHyderabad to assist asap https://t.co/92BX6OmcOJ
— KTR (@KTRBRS) April 17, 2023