హైదరాబాద్ లో కొందరు దుండగులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వరుస చైన్ స్నాచింగ్ కు పాల్పడుతూ మహిళలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ యువకుడు నడిరోడ్డులో వృద్దురాలిపై దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
ఈ మధ్యకాలంలో కొందరు దుండగులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అందమైన అమ్మాయి రోడ్డుమీద కనబడితే చాలు ఐ లవ్ యూ అని చెప్పడం, కాదంటే హత్యలు, అత్యాచారాలు చేస్తున్నారు. ఇదే కాకుండా ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు. దీనికి నిరాకరిస్తే చివరికి చంపడానికి కూడా వెనకాడడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ లో ఓ యువకుడు బరితెగించాడు. నడి రోడ్డుపై వృద్ధురాలు అని చూడకుండా దారుణానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?
వివరాల్లోకి వెళ్తే.. అది హైదరాబాద్ పాతబస్తిలోని శాలిబండ ప్రాంతం. ఇక్కడే ఓ వృద్ధురాలు చేతిలో సంచితో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. ఆమెను గమనించిన ఓ యువకుడు.. ముసలవ్వ వెంటే వెళ్లాడు. మెల్లగా ఆమె వద్దకు వెళ్లి ఆ వృద్ధురాలి చేతిలో ఉన్న సంచిని లాక్కున్నాడు. దీంతో ఆ వృద్దురాలు కిందపడి అటు ఇటు చూసేలోపే ఆ యువకుడు అక్కడి నుంచి బైక్ పై పరారయ్యాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన చాలా మంది.. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ వృద్ధురాలు ఎవరు? ఆ సంచిలో ఏముందనేది ఇంకా తెలియాల్సి ఉంది. నడిరోడ్డుపై వృద్ధురాలి అని చూడకుండా కిందపడేసి చేతిలో సంచి లాక్కెళ్లిన యువకుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
వృద్ధురాలనే కనికరం లేకుండా.. ఛీ.. pic.twitter.com/yRro2tf7WG
— venky bandaru (@venkybandaru13) April 20, 2023