నేటికాలంలో చాలా మంది యువకులు తమ పెళ్లిని ఎంతో గ్రాండ్ గా చేసుకోవాలని కోరుకుంటుంది. అయితే కొందరు మాత్రం అమ్మాయి నుంచి ఎంత కట్నం వస్తుంది. వారికి ఆస్తులు ఏ మాత్రం ఉన్నాయి అనే లెక్కలు వేసుకుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం విభిన్నంగా.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే పని చేశాడు.
నేటికాలంలో చాలా మంది యువకులు తమ పెళ్లిని ఎంతో గ్రాండ్ గా చేసుకోవాలని కోరుకుంటుంది. అయితే కొందరు మాత్రం అమ్మాయి నుంచి ఎంత కట్నం వస్తుంది. వారికి ఆస్తులు ఏ మాత్రం ఉన్నాయి అనే లెక్కలు వేసుకుంటారు. అయితే మరికొందరు యువకులు మాత్రం.. ఎటువంటి ఫలితాలను ఆశించాడుకుండా అందరికి ఆదర్శంగా నిలిచే పనులు చేస్తుంటారు. తాజాగా కరీనంగర్ కి చెందిన ఓ యువకుడు కూడా అలాంటి మంచి పని చేసి నేటితరం యువతకు ఆదర్శంగా నిలిచాడు. ఇంతకి అతడు చేసిన పని ఏమిటనే కథ మీ సందేహం. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
కరీంనగర్ జిల్లా మెతుకుపల్లికి చెందిన కర్నకంటి రమ్య అనే యువతి తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే చనిపోయార. దీంతో రమ్య హనుమకొండలోని ప్రభుత్వ బాలికా సదనంలో పెరిగి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఇక శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన అనబత్తుల వినయ్ అనే యువకుడు మండల పరిషత్‌లో ఔట్‌సోర్సింగ్‌లో టైపిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అతడికి చిన్నతనం నుంచి సమాజం పట్ల బాధ్యత వ్యవహరిస్తుంటాడు. అలానే సమాజానికి ఎదో చేయాలని, నలుగురికి తాను ఆదర్శంగా నిల్చే పనులు చేయాలని భావించేవాడు. ఎక్కువ మంది యువకులు.. తల్లిదండ్రులు, డబ్బులు ఉన్న యువతులను పెళ్లి చేసుకుంటారు.
అతడు మాత్రం అనాథకు జీవితం ఇవ్వాలని అనుకున్నాడు. అలా అనాథ అమ్మాయిని పెండ్లి చేసుకోవాలని ఐదు నెలల క్రితం జిల్లా సంక్షేమ శాఖ ఆఫీస్ లో దరఖాస్తు చేసుకున్నాడు. అతడి దరఖాస్తుకు అధికారులు ఆమోదం తెలపడంతో వినయ్, రమ్యల పెళ్లికి లైన్ క్లియర్ అయింది. అధికారులు వినయ్, రమ్యతో పెండ్లి నిశ్చియించారు. రమ్య తరపున ఐసీడీఎస్ అధికారులే పెళ్లి పెద్దలుగా వ్యవహరించి గురువారం పత్తిపాకలోని గౌడ కమ్యూనిటీ హాలులో పెండ్లి జరిపించారు. వినయ్ చేసిన ఈ పనికి స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు. మరి.. వినయ్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.