బిడ్డ బాధ తల్లికే అర్దమవుతుందని ఊరికే అనలేదు. గుక్క పట్టి ఏడుస్తున్న ముక్కు ముఖం తెలియని పసిపాపకు ఆ తల్లి పాలిచ్చి లాలించింది. పోలీసులంటే కఠినంగానే కాదు ప్రేమగా కూడా ఉంటారని ఆ మహిళా పోలీస్ నిరూపించింది. విధులు నిర్వహిస్తూనే ఆకలితో అలమటిస్తున్న పసిబిడ్డకు అమ్మగా మారారు.
బిడ్డ బాధ తల్లికే అర్దమవుతుందని ఊరికే అనలేదు. గుక్క పట్టి ఏడుస్తున్న ముక్కు ముఖం తెలియని పసిపాపకు ఆ తల్లి పాలిచ్చి లాలించింది. పోలీసులంటే కఠినంగానే కాదు ప్రేమగా కూడా ఉంటారని ఆ మహిళా పోలీస్ నిరూపించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడామే హాట్ టాపిక్ గా మారారు. కోట్లది మంది ప్రజల అభిమానాన్ని చురగొన్నారు. శనివారం జరిగిన ఎస్సై పరీక్షల్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆకలితో అలమటిస్తున్న ఓ చిన్నారికి తల్లిగా మారింది. ఈఘటన శనివారం హైదరాబాద్ లోని నార్సింగ్ లో జరిగింది.
శనివారం తెలంగాణ వ్యాప్తంగా ఎస్సై రాత పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఎంతో మంది మహిళలు ఈ పరీక్షలకు హాజరయ్యారు. అలానే చాలా మంది తమ పిల్లలతో సహా పరీక్షలకు హాజరయ్యారు. మరికొందరు మహిళలు అయితే పసిపిల్లలను తీసుకుని మరీ ఎస్సై పరీక్షలకు హాజరయ్యారు. అలానే హైదబాద్ కు చెందిన అఖిల్ అనే మహిళ.. గండిపేటలోని ఎంజీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఎస్సై రాత పరీక్షకు తన రెండు నెలల పసికందుతో వచ్చింది. ఆ బిడ్డను తన భర్త ఒడిలో ఉంచి.. ఆమె పరీక్షా కేంద్రంలోకి వెళ్లింది.
కొద్ది సమయం గడిచిన తరువాత పాపకు తెచ్చిన డబ్బా పాలు అయిపోయాయి. దీంతో ఆ పసిబిడ్డ పాల కోసం గుక్కపెట్టి మరీ ఏడుస్తుంది. ఇదే సమయంలో అక్కడ కన్యాకుమారి అనే మహిళ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. ఆ పాప ఏడుస్తూ ఉండటాన్ని ఆమె గమనించారు. ఆ పసి పాపను తన ఒడిలోకి తీసుకుని పాలు పట్టిచించారు. అంతేకాక ఆ పాపను లాలిస్తూ ఆ కాసేపు తల్లిగా మారారు. అలా పరీక్ష ముగిసే వరకు ఒకవైపు విధులు నిర్వహిస్తూనే, మరొకవైపు పాపకు అమ్మగా మారి లాలించారు. అలా విధులు నిర్వహిస్తూ పసిపాపను లాలించిన మహిళా కానిస్టేబుల్ పై స్థానికులు ప్రశంసల వర్షం కురిపించారు.
అంతేకాక పరీక్ష అనంతరం బయటకు వచ్చిన అఖిలా ఆ మహిళా కానిస్టేబుల్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఈ విషయంపై మహిళా కానిస్టేబుల్ స్పందిస్తూ.. తనకు ఇద్దరు చిన్న పిల్లలున్నారని, ఈ చిన్నారిని చూడగానే వారే గుర్తుకు వచ్చారని తెలిపారు. విధుల్లో ఉన్నా తాను ఓ బిడ్డకు తల్లినే అనే విషయం గుర్తుకు వచ్చి పాపకు పాలిచ్చానని ఆమె తెలిపారు. ఆమె చేసిన ఈ పనికి అందరూ అభినందించారు. మరి.. ఖాకీ చొక్క వెనుక దాగి ఉన్న ఈ తల్లి ప్రేమపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం తెలియజేయండి.