కండ్లముందే తల్లి విగతజీవిగా పడి ఉన్నా.. ఆ దుఃఖాన్ని దిగమింగుకొని ఆ తల్లి ఆశయం కోసం పరీక్షకు హాజరయ్యాడు ఓ కొడుకు. కన్నీళ్లు తెప్పించే ఈ ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్ లో చోటుచేసుకుంది.
ఒకవైపు తల్లి మరణం.. మరోవైపు పదో తరగతి పరీక్ష..ఈ పరిస్థితి ఎవరి జీవితంలో చోటుచేసుకున్న వారి బాధలు వర్ణనాతీతం. జన్మనిచ్చిన తల్లి మరణించిందన్న బాధ మనిషిని పుట్టెడు దుఃఖంలో పడేస్తుంది. ఇలాంటి సమయంలో తల్లి తప్ప మరో ఆలోచన గుర్తుకు రాదు. తల్లితో తనకున్న జ్ఞాపకాలు.. తల్లి తనకు చెప్పిన మాటలు పదే పదే గుర్తొస్తుంటాయి. అంతటి ఆ దుఃఖాన్ని దిగమింగుకొని ఆ తల్లి ఆశయం నెరవేర్చాలని పరీక్షకు హాజరయ్యాడు ఓ కొడుకు. కన్నీళ్లు తెప్పించే ఈ ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్ లో చోటుచేసుకుంది.
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని వాంకిడి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి మహమ్మద్ ఫజల్ తల్లి శుక్రవారం మరణించారు. అనారోగ్యం పాలైన ఆమెను శుక్రవారం రాత్రి నిర్మల్ ఏరియా తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. శనివారం వాంకిడి గ్రామంలో అంతక్రియలు నిర్వహించాల్సి ఉంది. మరోవైపు ఆ బాలుడికి పదో తరగతి గణిత పరీక్ష ఉంది. ఈ క్రమంలో ఆ బాలుడు తన తల్లి చనిపోక ముందు చెప్పిన. ‘బిడ్డా.. పరీక్షలు మంచిగా రాయాలి..’ అన్న మాటలను గుర్తు తెచ్చుకొని పరీక్షకు హాజరయ్యాడు. దీంతో తోటి స్నేహితులు సదరు విద్యార్థికి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.