SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » A Student From Nalgonda Basheera Innovation Get Appreciation From Whole Country

నాన్న బాధ తీర్చడానికి అద్భుత యంత్రాన్ని కనిపెట్టిన చిన్నారి ! సెల్యూట్ చేసిన కేటీఆర్

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Tue - 5 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నాన్న బాధ తీర్చడానికి అద్భుత యంత్రాన్ని కనిపెట్టిన చిన్నారి ! సెల్యూట్ చేసిన కేటీఆర్

కంటే కూతురినే కనాలి అంటారు. ఆడ కూతురికి తల్లితండ్రుల మీద అంతటి ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా కూతురికి నాన్న అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. వేలు పట్టి నడక నేర్పించే నాన్నే ఆమె మొదటి హీరో. అలాంటి తండ్రే నడవలేక ఓ కుర్చీకి పరిమితం అయిపోతే!  ఒళ్ళు హూనం చేసుకుని తన కోసం కష్టపడి పని చేసే నాన్న, ఒక్కసారిగా తన పని కూడా తానే చేసుకోలేని స్థితికి వచ్చేస్తే!  ఇలాంటి పరిస్థితిలో ఏ కూతురు హృదయం అయినా బరువెక్కిపోతుంది. తన సూపర్ హీరోని అలా చూడల్సి రావడం ఏ బిడ్డకైనా నరకమే. 9వ తరగతి చదువుతున్న బషీరాకి కూడా ఇలాంటి సమస్యే వచ్చింది. కానీ.., ఆ చిన్నారికి తండ్రి మీద ఉండే ప్రేమే ఓ అద్భుతం జరగడానికి కారణం అయ్యింది. అసలు తండ్రి కోసం బషీరా ఆవిష్కరించిన అద్భుతం ఏమిటి? కేటీఆర్ సైతం ఈ చిన్నారిని ఎందుకు మెచ్చుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

బషీరా వాళ్ళది నల్గొండలో ఓ మధ్యతరగతి కుటుంబం. ఆమె నాన్న కష్టంతోనే ఇల్లు గడిచేది. కానీ.., ఓ రోజు ఉదయాన్నే లేచి పనికెళ్లాల్సిన నాన్న కళ్లెదుట కోమాలో ఉన్నాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి వాళ్ళది. డాక్టర్లు పక్షవాతంగా తేల్చారు. ఆ వార్త విన్న బషీరా కుటుంబం నోట మాట రాలేదు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. ఇప్పుడు కుటుంబాన్ని సాకేదెవ్వరు? తమను ఆదుకునేదెవరు అన్నదే వారి మదిలో మెదిలిన మొదటి ప్రశ్న. భర్తను కాపాడుకునేందుకు ఆ భార్య పని బాట పట్టింది. కుటుంబ పోషణ.. భర్త బాధ్యత తీసుకుని ఆ కుటుంబానికి పెద్ద దిక్కైంది. కరోనా కాలంలో వారు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. చక్కగా నడవాల్సిన నాన్న చక్రాల కుర్చీకి పరిమిత మయ్యాడు. అమ్మ పని మానుకుంటే వారికి తిండి దొరకదు. నాన్నను చూసుకోవాలంటే ఆ చిన్నారి బషీరా బడి మానుకోవాల్సిందే. అలా ఆ అమ్మాయి ఒక ఏడాది చదవు కూడా మానుకొంది. తరువాత ఏడాది ఆమె స్కూల్ కి వెళ్లినా, బషీరా ఆలోచనలు అంతా తండ్రి గురించే. బషీరాకి కుటుంబ పోషణ ఎలా అన్నబాధ లేదు. తన భవిష్యత్ గురించి ఆలోచన లేదు. ఆమె మదిలో ఎప్పుడూ ఒకటే ఆలోచన తండ్రి పడే బాధకు ఏదైనా పరిష్కారం ఉందా? ఎవరిపై ఆధారపడకుండా తన కనీస అవసరాలను తీర్చుకోగలిగితే చాలు కదా అన్నదే ఆమె ఆలోచన. స్కూల్ లో కూడా నాన్న గురించే ఆలోచన. సరిగ్గా.. ఇలాంటి సమయంలో స్కూల్ లో వచ్చిన సైన్ ఫెస్ట్ బషీరా కష్టానికి ఉపాయాన్ని అందించింది.

hydralic wheel chairతండ్రి కోసం బషీరా సరికొత్త ఆవిష్కరణ:

తెలంగాణ స్టూడెంట్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌లో భాగంగా పాఠశాలలో ఉపాధ్యాయులు ఇచ్చిన అంశం ఆమెని ఆకర్షించింది. సమాజంలో మన చుట్టూ వందల సమస్యలు ఉంటాయి. కానీ.., ఒక్క ఆలోచనతో ఆ కష్టాలను తీర్చవచ్చు. మీ ప్రయోగం కూడా నిజ జీవితంలో మనుషులు పడే ఇబ్బందిని తొలగించేది అయ్యుండాలి. ఇదే ఉపాధ్యాయులు ఇచ్చిన అంశం. ఈ ఆలోచన బషీరాని బాగా ఆకర్షించింది. మా నాన్న పడుతున్న కష్టానికే పరిష్కారం కనుగొంటే బాగుంటుంది కదా అని బషీరా అనుకుంది. తామెవరూ లేకపోయినా.. కుర్చీలో ఉండే తన తండ్రి ఏ వస్తువునైనా తీసుకోగలిగేలా చేయాలనుకుంది. అంటే.. సాధారణంగా కుర్చీలో అటూ ఇటూ తిరుగుతున్న తండ్రికి కుర్చీ సాయంతో పైకి లేవగలిగేలా చేయాలనుకుంది. అలా.. కొన్ని నెలలు పాటు.. నిద్రలేని రాత్రులు గడిపి తన తండ్రి కోసం హైడ్రాలిక్ వీల్ చైర్ కనుగొంది బషీరా. ఈ వీల్ చైర్ సహాయంతో బషీరా తండ్రి తన పనులను తాను చేసుకోగలిగాడు. దీంతో., బషీరా ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

దేశవ్యాప్తంగా అరుదైన గుర్తింపు

తెలంగాణ స్టూడెంట్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌కు రాష్ట్రం నుంచి 7,900 పైచిలుకు ఐడియాస్ పంపితే బషీరా చేసిన ఆవిష్కరణకు టాప్ 25లో చోటు దక్కింది. హైదరాబాద్ లో  నిర్వహించిన ఫినాలేలో బషీరా ఆవిష్కరణ చూసి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ఆశ్చర్యపోయారు. తన ఆలోచన ఎందరికో జీవితంపై ఆశను పెంచుతుందని కొనియాడారు. బషీరా కుటుంబ నేపథ్యం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని మాటిచ్చారు.తన తండ్రి కష్టంలో నుంచి పుట్టుకొచ్చిన బషీరా ఆలోచన వీల్ చైర్ లో కాలం వెళ్లదీస్తున్న ఎందరికో ఉపయోగకరంగా మారనుంది. ఇది.. ఆ కూతురికి తండ్రి మీద ఉన్న ప్రేమకి నిదర్శనం. మరి.. ఈ విషయంలో చిన్నారి బషీరాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Tags :

  • Hydralic Wheel Chair
  • nalgonda
  • Shaik Basheera
  • Students Innovations
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అద్దంకి- నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..!

అద్దంకి- నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..!

  • రైతన్నలకు రాష్ర ప్రభుత్వం శుభవార్త.. 80 శాతం సబ్సిడీతో నాటు కోళ్లు!

    రైతన్నలకు రాష్ర ప్రభుత్వం శుభవార్త.. 80 శాతం సబ్సిడీతో నాటు కోళ్లు!

  • కాంగ్రెస్  MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు..!

    కాంగ్రెస్ MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు..!

  • కోమటిరెడ్డి ఆడియో కలకలం.. చెరుకు సుధాకర్‌ని చంపేస్తాం అంటూ!

    కోమటిరెడ్డి ఆడియో కలకలం.. చెరుకు సుధాకర్‌ని చంపేస్తాం అంటూ!

  • ఇంటర్ అమ్మాయి..కూలీ అబ్బాయి! కట్ చేస్తే..పురుగుల మందు తాగి..

    ఇంటర్ అమ్మాయి..కూలీ అబ్బాయి! కట్ చేస్తే..పురుగుల మందు తాగి..

Web Stories

మరిన్ని...

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!
vs-icon

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..
vs-icon

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!
vs-icon

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!
vs-icon

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!
vs-icon

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!
vs-icon

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!
vs-icon

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!

తాజా వార్తలు

  • వాహనదారులకు శుభవార్త.. టోల్ గేట్ దగ్గర టోల్ ఫీజు కట్టక్కర్లేదు: కేంద్రం

  • రైల్వే ట్రాక్ పక్కన గుడి.. తొలగించాలని చూస్తే వింత అనుభవాలు

  • ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

  • దుబాయ్ తీసుకెళ్లి టార్చర్ పెట్టారు.. తిండి పెట్టకుండా గదిలో బంధించి: సనా

  • సొంతంగా హెలికాప్టర్ కలిగిన హీరోయిన్!.. అప్పట్లోనే వేల కోట్ల ఆస్తులు!

  • ట్రాన్స్ ఫ్లైట్ అటెండెంట్ కైలీ స్కాట్ మృతి..

  • కులాంతర వివాహం చేసుకుంటే రూ.10 లక్షలు.. ఎక్కడంటే?

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • AP గ్రాడ్యుయేట్స్‌ MLC ఎన్నికల్లో TDP హవా.. 2 స్థానాల్లో ఘన విజయం!

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam