ఈ మద్య కాలంలో చాలా మంది కుటుంబ కలహాల వల్ల తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాల వల్ల ఇంట్లో సమస్యలు తలెత్తడంతో గొడవలు మొదలై.. క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పపడుతున్నారు.
ఈ మద్య కాలంలో చాలా మంది క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు నిండు జీవితాన్ని బలిగొంటున్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు, వివాహేతర సమస్యలు కుటుంబ కలహాలు మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలను భూతద్దంతో చూసి వాటికి పరిష్కారం చూడకుండా ఎమోషన్ కి గురై క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పెద్దవారు చేసిన దుశ్చర్యలకు చిన్నపిల్లలు కూడా బలవుతున్నారు. ఓ మహిళ తన రెండు నెలల చిన్నారితో గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే..
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇందారం సమీపంలో ఉన్న గోదావరి వంతెనపై నుండి రెండు నెలల చిన్నారితో ఓ తల్లి గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో అక్కడ చుట్టుపక్కల వారు చూసి వెంటనే తల్లి, రెండునెలల శిశువును కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే రెండు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు తల్లి ప్రాణం కాపాడగలిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి మహిళను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను శ్రీరాంపురానికి చెందిన సింగరేణి కార్మికుని భార్యగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో ఇందారం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.