గుండె పోటుతో నెలల పసికందు నుండి 90 ఏళ్ల వృద్ధుల వరకు చనిపోతున్నారు. ఇటీవల కాలంలో ఈ మరణాల సంఖ్య పెరుగుతోంది. హార్ట్ స్ట్రోక్ కారణంగా 15 లోపు పిల్లలు కూడా తిరిగి రాని లోకాలకు వెళుతూ.. తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
గుండె అకారణంగా అలసిపోతుంది. భరించలేని బాధను నింపుతూ బతుకు మీద ఆశల్ని సమాధి చేస్తోంది. పిడికడంత గుండె భారంగా మారి, బలహీన పడి ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇటీవల కాలంలో హార్ట్ఎటాక్ కారణంగా అనేక మంది ప్రాణాలు విడిచారు. నెలల పసికందు నుండి 90 ఏళ్ల వృద్ధుల వరకు గుండె పోటుకు గురై చనిపోతున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలువురు మృతి చెందారు. హార్ట్ స్ట్రోక్ కారణంగా 15 లోపు చిన్నారులు కూడా తిరిగి రాని లోకాలకు వెళుతూ.. తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిలుస్తున్నారు. 40-60 ఏళ్ల లోపు వారు ఇటీవల కాలంలో గుండె పోటుతో చనిపోతున్నారు. తాజాగా ఓ మహిళ ఎంపీడీఓ గుండె పోటుతో మరణించారు.
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని కీసర ఎంపీడీఓ రమాదేవి (53) ఆదివారం హార్ట్ ఎటాక్‌తో మరణించారు. కొత్తపేట సమీపంలో నివాసం ఉంటున్న రమాదేవి ఆదివారం ఉదయం అస్వస్థతకు గురికావడంతో ఆమెను యశోద ఆసుపత్రిలో తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆమె సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గుండెపోటుకు గురయ్యారు. అనంతరం ప్రాణాలు విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. గత ఏడాది కాలంగా కీసర ఎంపీడీఓగా పనిచేస్తున్న రమాదేవి మృతి పట్ల కీసర మండల పరిషత్ అధ్యక్షురాలు మల్లారపు ఇందిర, జెడ్పీ వైస్ చైర్మన్ బెస్త వెంకటేష్, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వివిధశాఖల అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. అందరితో కలిసి మెలిసి ఉండే రమాదేవి ఇకలేరన్న విషయాన్ని మండల పరిషత్ అధికారులు, సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు.