సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మన కళ్ల ముందు ఎన్నో అద్భుతమైన ఫోటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. కొన్ని ఫోటోలు, వీడియలో మనసు కదిలిచే విధంగా ఉంటే.. మరికొన్ని కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటాయి. జాతి వైరం మరచి కొన్ని జంతువులు మాతృత్వాన్ని ప్రదర్శిస్తుంటాయి.
ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలోని వింతలు విశేషాలు మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నాయి. ఎన్నో రకాల వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే.. కొన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటున్నాయి.. మరికొన్ని మానవత్వం అంటే ఇలా ఉంటుందా అనే విధంగా ఉంటాయి. జంతువులు చేసే పనులు, అవి చూపించే తెలివితేటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. జాతి వైరం మరచి ఓ శునకం పందిపిల్లకు పాలు ఇస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
సాధారణంగా కుక్కలకు పందులకు అస్సలు పడదు. పందులు కనిపిస్తే వెంట బడి మరీ తరుముతుంటాయి కుక్కలు.. కొన్నిసార్లు తీవ్రంగా గాయపరుస్తుంటాయి. అలాంటిది జాతి వైరాన్ని మరచి ఓ పిందిపిల్లకు పాలు ఇస్తున్న శునకాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. పాల కోసం అల్లాడుతున్న పంది పిల్లకు పాలిచ్చి అమ్మగా మారి దాని ప్రాణాలు కాపాడుతన్న శునకంపై స్థానికంగా ఆకసక్తికర చర్చ జరుగుతుంది. నిజంగా మాతృత్వానికి జాతి వైరం అడ్డు రాదు అంటున్నారు. 19వ డివిజన్ వరంగల్ కాశీబుగ్గ సొసైటీ కాలనీలో ఈ దృశ్యం కనిపించింది. అరుదైన ఈ దృష్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
గతంలో కూడా ఇలాంటి ఘటనలు పలు చోట్ల జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా జగ్గం పేటలో పందిపిల్లకు ఓ శునకం తల్లిగా మారి పాలు ఇస్తూ వాటి ఆకలి తీర్చింది. ప్రకాశంజిల్లా మార్కాపురం బస్టాండ్ వద్ద ఓ పంది ఆవు పొదుగు చూసి వెల్లి పాలు తాగింది. సాధారణంగా ఆవులు వేరే ఏ జంతువుకి పాలు ఇచ్చేందుకు సుముఖత చూపించవు.. కానీ బిడ్డ ఆకలి తల్లికి తెలుసు అన్నట్లు ఆకలితో ఉన్న పందిపిల్ల పాలు తాగుతుంటే ఏమీ అనకుండా మాతృత్వాన్ని చాటుకుంది. జంతువులు సైతం కొన్ని సమయాల్లో భావోద్వేగ కోణాన్ని చూపిస్తుంటాయి.. అవి ఇతర జంతువుల ఆకలి గమనించి ఆప్యాయత చూపిస్తుంటాయి. అప్పుడు జాతి వైరం గురించి ఏమాత్రం అలోచించవు. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.