ఆ యువతికి అంతకుముందే ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయం తెలిసినా కూడా ఓ యువకుడు నన్ను ప్రేమించాలంటూ ఆ యువతిని వేధింపులకు గురి చేశాడు. అంతేకాకుండా.. నన్ను ఖచ్చితంగా ప్రేమించాలి, లేదంటే చచ్చిపో అంటూ టార్చర్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో ఎన్నో దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ప్రేమించాలని వెంటపడడం. కాదంటే హత్యలు, అత్యాచారాలు. ఇవే నేటి కాలంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ యువకుడు ప్రేమించాలంటూ యువతిని టార్చర్ పెట్టాడు. అంతేకాకుండా నన్ను ప్రేమించకపోతే చచ్చిపో అంటూ మేసేజ్ లు చేస్తూ రోజూ వేధింపులకు పాల్పడ్డాడు. ఇక ఆ యువకుడి వేధింపులను భరించలేని ఆ యువతి తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లి. ఇదే గ్రామంలో ఎంబడి సాయిష్మ, నలిమేల వినయ్ కుమారు అనే యువతి యువకుడు నివాసం ఉంటున్నారు. ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో కాస్త పరిచయం ఉంది. అయితే ఇదే పరిచయం సాకుతో వినయ్ కుమార్.. సాయిష్మను ప్రేమించాలంటూ గత కొంత కాలం నుంచి వెంటపడుతున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలోనే సాయిష్మకు మరో యువకుడితో ఎంగేజ్మెంట్ జరిగింది. అయినా ఇవేం పట్టించుకోని వినయ్ కుమార్.. ప్రేమించాలంటూ ఆ యువతిని తరుచు వేధింపులకు గురిచేసేవాడు.
ఇలా చేయొద్దని ఆ యువతి ఎంత మొరపెట్టుకున్న.. అస్సలు పట్టించుకునేవాడు కాదు. అంతేకాకుండా నన్ను ప్రేమించకపోతే చచ్చిపో అంటూ కూడా మెసేజ్ లు చేసేవాడు. ఇక రోజు రోజుకు అతడు సైకోలా మారి వేధింపులకు పాల్పడేవాడు. ఇతగాడి టార్చర్ ను భరించలేని సాయిష్మ.. గత శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన ఆమె కుటుంబ సభ్యులు ఆ యువతిని నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. వారం రోజులు చికిత్స పొందిన సాయిష్మ.. సోమవారం ప్రాణాలు విడిచింది.
సాయిష్మ చనిపోవడంతో ఆ యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వినయ్ కుమార్ టార్చర్ వల్లే సాయిష్మ చనిపోయిందని, నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రేమించాలని వెంటపడి చివరికి సాయిష్మ మరణానికి కారణమైన యువకుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.