తోటల్లో పండ్లు దొంగిలించడం భలే సరదాగా ఉంటుంది చిన్నప్పుడు. తోట యజమాని కూడా చిన్న పిల్లలకే కదా.. చూసి చూడనట్లు ఉంటాడు. తోట యజమాని అరిస్తే.. తెంచుకున్న పండ్లను పట్టుకుని.. దొరక్కుండా పరిగెడతాం. దొరికామా.. రెండు దెబ్బలు వేసి వదిలేస్తాడు. కానీ ఆమె..
చిన్నతనంలో చేసే చిలిపిపనులు తలుచుకోని మనిషి ఉండడు. కోతి కొమ్మొచ్చి, వంగుళ్లు, దూకుళ్లు, అష్టా చెమ్మాలు, పరుగు పందాలు, స్నేహితులతో ఈత కొట్టడాలు, వారితో పొట్లాటలు, ఎంగిలి తిండ్లు, తోటల్లో పళ్లు దొంగిలించడాలు సరదాలు. వీటిల్లో తోటల్లో పండ్లు దొంగిలించడాలు భలే సరదాగా ఉంటుంది. తోట యజమాని చూడకుండా పళ్లు దొంగిలిస్తుంటారు చిన్నపిల్లు. యజమాని అరిస్తే.. తెంచుకున్న పండ్లను పట్టుకుని.. దొరక్కుండా పరిగెడతాం. దొరికామా రెండు దెబ్బలు వేస్తాడు లేదా చిన్న పిల్లలకే కదా అని వార్నింగ్ ఇస్తాడు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే యజమాని మాత్రం కాఠిన్యంగా వ్యవహరించారు. ఓ చిన్నారి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. ఈ ఘటన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
తోటలో కాయలు తెంపిందని ఓ పదేళ్ల బాలికను తోట యజమాని దంపతులు గొలుసులతో కట్టేసిన అమానుష ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి విఠలాపురంలో బత్తాయి తోటలో ఉన్న పళ్లను కోసిందని ఓ బాలికను తోట యజమాని.. పశువుల్ని కట్టేసే ఇనుమ గొలుసులతో కట్టేసి ఎండలో నిల్చొబెట్టింది తోటగళ్ల ఆమె. ఇంట్లో పిల్ల కనిపించడం లేదని వెతికితే కట్టేసి కనిపించింది. ఏమనీ అడిగితే.. వారిపైనా కయ్య్ మని అరించింది యజమాని. పిల్లను భయపెట్టేందుకు ఇలా చేశానంటూ తన తప్పును కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది.
తమ బిడ్డను శిక్షించిన విషయం తెలుసుకున్న బాలిక బంధువులు తోట యజమాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారిని శిక్షించిన వీడియో, తోట యజమానితో బాలిక తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పండు కోసం ఓ చిన్నారిని నేరస్తురాలిగా చిత్రీకరించి ఇంతలా శిక్షిస్తారా, నీకు విధిస్తే ఆ శిక్ష అప్పుడు తెలుస్తుందని నెటిజన్లు మండిపడుతున్నారు. చిన్నారిని శిక్షించిన తోట యజమానిపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు.