ఈ మద్య కొంత మంది జనాలు ఈజీ మనీ కోసం ఎన్ని తప్పులు చేయడానికైనా సిద్ద పడుతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్, మారణాయుధాలు, గోల్డ్ స్మగ్లింగ్, వ్యభిచారం ఇలాంటి దందాలతో కోట్లు సంపాదిస్తున్నారు. విదేశాల నుంచి బంగారం రక రకాల పద్దతుల్లో స్మగ్లింగ్ చేయడం.. ఎయిర్ పోర్ట్ లో అడ్డంగా బుక్ కావడం చూస్తూనే ఉన్నాం. భారీ ఎత్తున బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాని శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ కి చెందిన విమానంలో కొలంబో నుంచి హైదరాబాద్ కి తొమ్మిది మంది వచ్చారు. వీరిలో ముగ్గురు పురుషులు, ఆరుగురు మహిళలు. అయితే పురుషుల ప్రవర్తనలో తేడాను గమనించిన ఎయిర్ పోర్ట్ అధికారులు వారిని అదుపులోకి తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించారు. బంగారాన్ని పురుషులు ఏకంగా పురీషనాళం, నడుము భాగంలో దాచుకున్నారు. ఇక స్త్రీలు లో దుస్తుల్లో, బ్యాగుల్లో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు భద్రతాధికారులు తెలిపారు.
తొమ్మిది మంది నుంచి 7.30 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దీని విలువ రూ.3.8 కోట్ల విలువ ఉంటుందని వారు వెల్లడించారు. మరో ప్రయాణీకుడు బంగారం ఉన్న ఓ చేతి సంచిని అక్కడే వదిలేసి పారిపోయాడు. దీనిపై ఆరా తీస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.