సాధారణంగా మనిషికి ఎంత డబ్బులు, ఆస్తి సంపాదించిన తృప్తి ఉండదు. ఇంక సంపాదిచాలనే ఆశ ఉంటుంది. నేటికాలంలో అయితే మరి దారుణం.. ఆస్తుల కోసం, డబ్బుల కోసం హత్యలకు కూడా తెగబడుతున్నారు. ఇలాంటి కాలంలో కూడా కొందరు ఉన్నదానిలో తృప్తిగా జీవిస్తున్నారు. పోయేటప్పుడు తీసుకెళ్లేది ఏముందీ పూట గడిస్తే చాలు అనుకుంటున్నారు. అచ్చం అలానే ఓ పెద్దావిడి ఆలోచిస్తూ తన జీవితాన్ని గడుపుతోంది. ఎక్కువ సంపాదన దేనికి, కడుపు నింపేంత వస్తే చాలు అని అంటూ ఆ పెద్దావిడి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమెకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
తెలంగాణలోని హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రాంతంలో ప్రేమ అనే 60 ఏళ్ల పెద్దావిడ ఉంది. ఈ పెద్దమ్మ ఓ ఆటో యాక్సిడెంట్‌లో రెండు కాళ్లూ కోల్పోయింది. మూడు చక్రాల సైకిల్ లేకుంటే కదల్లేదు. జీవితం అంటే పోరాటమే అని భావించే ఆమె తన కాళ్లపై తాను నిలబడాలనుకుంది. ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ ముందు చిన్న ఉపాధి కల్పించుకుంది. అక్కడి వచ్చే వాహనదారులకు చిన్న చిన్న అప్లికేషన్ ఫాములను అమ్ముకుంటూ రోజుకు ఒక వంద నుంచి నూటా యాభై రూపాయలు సంపాదిస్తుంది. ఆ సంపదతోనే తన పొట్ట పోసుకుంటుంది. ఇప్పటికీ ఎవ్వరి పైనా ఆధారపడకుండా తన బతుకును నడిపిస్తోంది.
ఆ సైకిల్‌నే ఆధారంగా చేసుకుని రోజూ ఆర్టీఏ ఆఫీస్‌కు వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి పనిచేస్తుంది. వచ్చిన డబ్బుతో తన ఇంట్లోనే నివాసం ఉంటుంది. అన్ని ఉండి ఆత్మహత్య చేసుకునే వారు ఈ పెద్దమ్మ చూసి జీవితంలో ధైర్యంగా ఎలా బ్రతకాలో నేర్చుకోవాలని స్థానికులు అంటున్నారు. ఆ పెద్దావిడ వీడియోపై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.