హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో కొద్ది రోజుల క్రితం మాయమై అత్యాచారం, హత్యకు గురైన ఆరేళ్ల బాలిక విషయంలో న్యాయం చేయాలని స్థానికులు ఆందోళన చేస్తున్న చేస్తున్న విషయం తెలిసిందే. బాధితులతో ఆయన మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. నెల రోజుల్లో నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. బాధితుల కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.50 వేల చెక్కును అందజేశారు.
ఆ కుటుంబంలోని ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య, కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్ విధానం ద్వారా ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ పరిధిలో అయ్యే ప్రతి వెసులుబాటు అమలయ్యేలా చేస్తానని శర్మన్ నచ్చజెప్పారు. ఇదిలా ఉంటే పాప కుటుంబ సభ్యులు తాజాగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మద్దతు కోరారు.
పవన్ కళ్యాన్ వస్తే ఇక్కడ మీడియా ఫోకస్ పడుతుందని.. బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరుగుతుందని పాప మేనమామ కోరారు. కళ్యాన్ సార్.. మీరు రావాలి మాకు న్యాయం జరిగేలా చూడాలి అంటూ వేడుకున్నాడు. మీ అల్లుడికి ప్రమాదం జరిగింది.. అందుకు మేము కూడా బాధపడుతున్నాం.. మాకు మద్దతు ఇస్తారని వేడుకుంటున్నాం అంటూ దీనంగా వేడుకున్నారు.