వజ్రపు ఉంగరం కాజేసి.. టాయిలెట్ సీట్లో పడేసింది ఓ యువతి. అవకాశం దొరికింది కాదా అని వజ్రపు ఉంగరాన్ని ఓ మహిళ చోరీ చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఏమీ తెలియనట్లు బాత్‌రూం కమోడ్ లో విసిరింది. దీని విలువ దాదాపు రూ. 50 లక్షలకు పైగా ఉంటుంది
మనం నిత్యం వినియోగించే వస్తువుల్లో బంగారం, వెండి చాలా విలువైనవిగా పరిగణిస్తాం. అయితే వాటిని అపురూపంగా చూసుకుంటాం. హిందువులు బంగారం, వెండి ఆభరణాలుగాని, వస్తువులను గాని సాంప్రదాయ బద్దంగా వాడుతుంటారు. బంగారం కంటే కూడా విలువైన ఖనిజం వజ్రం. వజ్రంతో చేసిన ఉంగరాలు, ఆభరణాలు చాలా ఖర్చుతో కూడినవిగా ఉంటాయి. లక్షలల్లో, కోట్లలో వీటి ధరలు ఉంటాయి. వజ్రాలను ప్రేమకు చిహ్నంగా, విలాసానికి గుర్తుగా భావిస్తారు. ఇవి వివిధ రంగులను పోలి ఉంటాయి. చాలా కఠినంగా ఉంటాయి. వజ్రాలు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. వజ్రాలతో చేసిన ఆభరణాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి చాలా అరుదుగా లభిస్తాయి. వజ్రాల నగలు చాలా హై స్టేటస్‌ను సూచిస్తాయి.
అలాంటి విలువైన వాటిలో అతిచిన్న వస్తువైనా సరే చాలా ఖరీదుతో కూడి ఉంటుంది. అటువంటి వజ్రపు ఉంగరం కాజేసి.. టాయిలెట్ సీట్లో పడేసింది ఓ యువతి. అవకాశం దొరికింది కాదా అని వజ్రపు ఉంగరాన్ని ఓ మహిళ చోరీ చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఏమీ తెలియనట్లు బాత్‌రూం కమోడ్ లో విసిరింది. దీని విలువ దాదాపు రూ. 50 లక్షలకు పైగా ఉంటుంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎఫ్ఎంఎస్ దంత, చర్మ వైద్యకేంద్రానికి.. నరేంద్ర కుమార్ అగర్వాల్ కోడలు వచ్చారు. చికిత్స చేస్తున్న టైంలో ఆమె చేతికున్న రూ.50 లక్షలకు పైగా విలువైన వజ్రపు రింగ్ పక్కన పెట్టారు. చికిత్స పూర్తి అవగానే వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఉంగరం విషయం గుర్తించి ఆమె మరల ఆస్పత్రికి వెళ్లింది. ఉంగరం కనిపించక పోవడంతో అక్కడ ఉన్న ఆస్పత్రి సిబ్బందిని విచారించింది. వారిలో సరైన స్పందన లేకపోవడంతో నరేంద్ర కుమార్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని సీసీ ఫుటేజ్ ను పరిశీలించినా ఫలితం లేకపోయింది. ఆస్పత్రి సిబ్బందిని విచారించారు. తన పర్సులో ఎవరో టిష్యూపేపర్లో చుట్టి ఉంగరం పెట్టారని.. తాను భయపడి దానిని బాత్‌రూం కమోడ్ లో వేశానని భయపడుతూ చెప్పింది. వెంటనే పోలీసుల సాయంతో కమోడ్, పైపులైన్లను తొలగించేసి ఉంగరాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అసలు విషయం బయటపడింది.