హైదరాబాద్ వనస్థలిపురంలోని క్రాంతి హిల్స్ కాలనీ. ఇదే కాలనీకి చెందిన 9, 10 ఏళ్లున్న ఇద్దరు బాలికలు స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నారు. అయితే రోజు లాగే స్కూలుకు వస్తూ పోతున్నారు. అలా వెళ్తున్న క్రమంలో సడెన్ గా స్కూల్ నుంచి ఇంటికి వెళ్లకుండా ఎక్కడికైన పారిపోవాలని పక్కా ప్లాన్ లో ఉన్నారు. ఇక అనుకున్నట్లుగానే ఇటీవల రోజు స్కూలు నుంచి పారిపోయారు.
దీంతో స్కూలు ముగిసాక ఆ పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు వారి తల్లిదండ్రులు ఆటోలో వచ్చి రెడీగా ఉన్నారు. స్కూలు నుంచి అందరి పిల్లలు వచ్చినా ఆ ఇద్దరు పిల్లలు మాత్రం ఇంకా లేదు. దీంతో తల్లిదండ్రులు కాస్త ఆందోళనకు గురై వెంటనే స్కూలు యాజమాన్యానికి సమాచారం అందించారు. ఇక వెంటనే స్కూల్లో ఉన్న సీసీ ఫుటేజ్ ని పరిశీలించగా వారిద్దరూ ఒకేసారి బయటకు వెళ్లారని మాత్రం స్పష్టంగా కనిపించింది. వెంటనే వారి స్నేహితులను విచారించగా వాళ్లు రెండు మూడు రోజుల నుంచే పారిపోయేందుకు ప్లాన్ ఉన్నట్లు వివరించారు.
దీంతో కాసేపు అటూ ఇటూ అంతా వెతికారు. అయినా వారి జాడ మాత్రం కనిపంచలేదు. ఏం చేయాలో తెలియక ఖంగారపడిన తల్లిదండ్రులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు మూడు గంటల పాటు స్థానిక పరిసరాల్లో గాలింపు చర్యలు చేపట్టగా ఓ బస్టాండులో ఇద్దరు బాలికలు కనిపించారు. వెంటనే స్కూలుకు తీసుకొచ్చి విచారించగా షాకింగ్ విషయాలు చెప్పారు. వారి చెప్పిన సమాధానాలు విని తల్లిదండ్రులతో పోలీసులు బిత్తరపోయారు.
ఇది కూడా చదవండి: ఈ ఫొటోలోని స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా?..
ఇక కారణం ఏంటంటే? ఇటీవల హిందీ పరీక్ష సరిగా రాయలేదని… పరీక్షలో సరైన మార్క్స్ రాకపోతే తల్లిదండ్రులు తమను హాస్టల్లో చేరుస్తారని బెదిరించారని అన్నారు. దీంతో ఆ భయంతోనే ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక పిల్లలను బెదిరించకుండా సున్నితంగా చెప్పాలని పోలీసులు తల్లిదండ్రులకు పిల్లలకు కౌన్స్ లింగ్ ఇచ్చారు. దీంతో పిల్లలు ఇంటికి చేరటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక పోలీసులకు చుక్కలు చూపించిన పిల్లల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.