Kidney Stones: సాధారణంగా ఎవరి కిడ్నీలోంచైనా ఒకటి రెండు రాళ్లు బయటపడ్డం చూసుంటాం. సమస్య పెద్దదైతే ఓ వందవరకు చిన్న చిన్న రాళ్లు పడుతుంటాయి. కానీ, ఓ వ్యక్తి కిడ్నీలోంచి ఏకంగా 206లో రాళ్లను బయటకు తీశారు. ఆ రాళ్లు కూడా చిన్న చిన్న రాళ్లు కాదు.. మీడియం సైజులో ఉన్నవే. ఈ సంఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… నల్గొండ జిల్లాకు చెందిన ఓ 54 ఏళ్ల వ్యక్తి గత కొన్ని నెలల నుంచి నడుము, కడుపు భాగంలో నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో స్థానికంగా ఉండే ఓ డాక్టర్‌ను కలిశాడు. ఆ డాక్టర్ నొప్పి తగ్గడానికి కొన్ని మందులు రాసిచ్చాడు. బాధితుడు నొప్పి పుట్టిన ప్రతీసారి డాక్టర్ రాసిచ్చిన మందులు వేసుకోవటం మొదలుపెట్టాడు.
నొప్పి తగ్గుతుండటంతో దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. రోజులు గడుస్తున్నాయి. నొప్పి మరింత పెరిగింది. ఉద్యోగం చేసుకోవటానికి కూడా ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. అతడికి పరీక్షలు చేసిన వైద్యులు ఎడమ కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. బాధితుడికి విషయం చెప్పి ఆపరేషన్‌కు సిద్ధం చేశారు. ఓ గంట పాటు కష్టపడి కిడ్నీలోని రాళ్లన్నింటిని బయటకు తీశారు. మొత్తం 206 రాళ్లు బయటపడ్డాయి. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు. కోలుకుని ఇంటికి కూడా వెళ్లిపోయాడని చెప్పారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Girl: చెల్లెలి కోసం అక్క ఆవేధన.. తల్లిగా మారిన యాచకురాలు