హైదరాబాద్ రోడ్లపై నిత్యం వేల కొద్ది వాహనాలు తిరుగుతుంటాయి. దాంతో రోడ్లు ఎక్కువగా మరమ్మతులకు గురౌతుంటాయి. తాజాగా హైదరాబాద్ లోని ప్రముఖ రహదారిపై భారీ గుంత పడింది.
హైదరాబాద్ మహానగరంలో నిత్యం రోడ్లపైకి వేలకొద్ది వాహనాలు వస్తుంటాయి పోతుంటాయి. దాంతో రోడ్లు ఎక్కువగా మరమ్మతులకు గురౌతుంటాయి. ఇక వర్షాకాలంలో అయితే భాగ్యనగరంలో రోడ్ల పరిస్థితి చెప్పేవిధంగా ఉండదు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో నిత్యం వెహికిల్స్ తో రద్దీగా ఉండే ప్రధాన రహదారిలో లోతైన గుంత ఏర్పడింది. ఆ గుంత దాదాపుగా 20 అడుగుల లోతు ఉన్నట్లుగా హైదరాబాద్ జలమండలి అధికారులు పరిశీలించి చెప్పారు. దాంతో అధికారులు అక్కడ తగు ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ లోని ప్రముఖ రహదారి అయిన MGBS-చాదర్ ఘాట్ రహదారిపై భారీ గుంత ఏర్పడింది. దాంతో సమాచారం అందుకున్న హైదరాబాద్ జలమండలి అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి వచ్చిన అధికారులు ఆ గుంతను పరిశీలించి దాదాపు 20 అడుగుల లోతు ఉంటుందని అంచనా వేశారు. అయితే నిత్యం రద్దీగా ఉండే రహదారి కావడంతో.. తక్షణమే మరమ్మతులు చేయడం సాధ్యం కాదని వారు తెలిపారు. అలా చేస్తే.. భారీ స్థాయిలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు తెలిపారు. దాంతో రాత్రికి ఈ మార్గంలో రాకపోకలు నిలిపివేసి.. మరమ్మతులు కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు. గుంత పడిన ప్రాంతంలో మలక్ పేట ట్రాఫిక్ పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేసి.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను జరగకుండా అప్రమత్తం చేస్తున్నారు.