ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ గోల్డ్ కారు వైరల్‌గా మారింది. ఆ గోల్డ్ కారును చూస్తున్న జనం ఆశ్చర్యపోతున్నారు. కారును ఫొటోలు తీస్తూ.. కుదిరితే కారుతో సెల్ఫీలు దిగుతూ సంతోషపడుతున్నారు.
‘ధనం మూలం ఇదం జగత్’ అని పెద్ద వాళ్లు ఊరికే అనలేదు. ‘ ఆకాశంలోని చందమామనైనా.. కొండమీది కోతినైనా’ మన దగ్గరకు తెచ్చే సత్తా కేవలం డబ్బుకు మాత్రమే ఉంది. డబ్బున్న వాళ్లు సర్వ సౌకర్యాలు.. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించగలరు. వస్తువుల రూపంలో సంతోషాన్ని కొనుక్కునే సత్తా కేవలం డబ్బున్న వారికి మాత్రమే ఉంటుంది. కొంతమంది డబ్బున్న వాళ్లు చేసే ప్రతీ పనిలో తమ స్టేటస్ కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సార్లు వాళ్లు చేసే కొన్ని పనులు అందరినీ ఆశ్చర్యపరిచే వైరల్ న్యూస్‌గా కూడా మారతాయి.
తాజాగా, ఓ వ్యక్తి తన కాస్ట్‌లీ బెంజ్ కారుకు బంగారం పూత పూయించాడు. దీంతో ఆ కారు నెట్టింట చక్కర్లు కొడుతూ. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన సామ్రాట్ అనే యువకుడికి చిన్నప్పటినుంచి బంగారం అంటే పిచ్చి. యుక్త వయసులోకి వచ్చిన తర్వాత కూడా ఆ పిచ్చి తగ్గలేదు. ఒంటినిండా భారీగా బంగారం ధరించి తిరిగే వాడు. ఈ నేపథ్యంలోనే అతడికి ఓ ఐడియా వచ్చింది. తన కారుకు కూడా బంగారం పూత పూయించాలని అనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా ఏర్పాట్లు మొదలుపెట్టాడు. దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూణెనుంచి గోల్డ్ ర్యాప్‌ను తెప్పించాడు. ఎంతో కష్టపడి దాన్ని కారుకు ఏర్పాటు చేయించాడు. ప్రస్తుతం ఈ కారు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కారును చూస్తున్న జనం హైదరాబాద్‌లో బంగారు కారు అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఆ కారును ఫొటోలు తీస్తూ.. కుదిరితే కారుతో సెల్ఫీలు దిగుతూ సంతోషపడుతున్నారు. మరి, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ గోల్డ్ కారుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.