తెలంగాణలో పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కేసులో బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ వివరాలు..
పదో తరగతి పేపర్ లీక్ కేసు తెలంగాణలో సంచలనం సృష్టించింది. దీనికన్నా ముందు.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం.. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది. నిందితులు చేసిన పనికి.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దవ్వడంతో.. నిరుద్యోగుల జీవితాలు ప్రశ్నర్థాకంగా మారాయి. పరీక్షలు వాయిదా పడటం.. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో తెలియకపోవడంతో.. నిరుద్యోగులు ఇంటి బాట పట్టారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ వ్యవహారాన్ని సిట్ దర్యాప్తు చేస్తోంది. రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఇదిలా ఉండగానే.. రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజ్ కలకలం సృష్టించింది. దాంతో అసలు ప్రభుత్వానికి పరీక్షల నిర్వహణ వచ్చా అన్న రేంజ్‌లో విమర్శలు వచ్చాయి. ఇక పేపర్ లీక్ అంశంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా తెలంగాణలో పదో తరగతి పేపర్ లీక్ కేసులో.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బండి సంజయ్ సహా మిగతా నిందితులను కరీంనగర్ జైలుకు తరలించారు. ప్రసుత్తం బండి సంజయ్‌ను కరీంనగర్ జైల్లోని గోదావరి బ్యారక్‌లో ఉంచారు. ఆయనకు ఖైదీ నంబర్ 7917 నెంబర్‌ను కేటాయించారు జైలు నిర్వాహకులు. ఇక బుధవారం రాత్రి బండి సంజయ్‌ను జైలుకు తీసుకువచ్చిన తర్వాత.. కుటుంబ సభ్యులు ఆయనను కలవడానికి వచ్చారు. కానీ అధికారులు అందుకు అనుమతించలేదు. ఈ కేసులో హన్మకొండ జిల్లా ప్రధాన కోర్టు మేజిస్ట్రేట్ బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
ఇక పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌ను ఏ1గా చేర్చారు. ఇక ఈ కేసులో ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా మోతం శివగణేశ్, ఏ6గా పోగు సురేశ్, ఏ7గా పోగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పోతబోయిన వసంత్ పేర్లను చేర్చారు. బయటకు వచ్చిన పేపర్ ఫోటోను బండి సంజయ్ సహా ఈటల రాజేందర్ పీఏ, ఇతరలు చాలామందికి పంపారని సీపీ రంగనాథ్ తెలిపారు. ప్లాన్ ప్రకారమే పేపర్ లీక్ చేశారని వెల్లడించారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.