ఇటీవల కొంతకాలం నుంచి తెలంగాణ వ్యాప్తంగా పేపర్ లీకేజ్ కలకలం చోటుచేసుకుంది. టీఎప్సీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం గత కొంతకాలం రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనాలే సృష్టించింది. ఈ ఘటన విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే పదో తరగతి ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. ఇదే సమయంలో ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇటీవల కొంతకాలం నుంచి తెలంగాణ వ్యాప్తంగా పేపర్ లీకేజ్ కలకలం చోటుచేసుకుంది. టీఎప్సీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం గతకొంతకాలం రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనాలే సృష్టించింది. ఈ ఘటన విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే పదో తరగతి ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. ఈ ఘటనతో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం చోటుచేసుకుంది. ఇదే సమయంలో పదో తరగతి పరీక్షలు రాసిన ఓ విద్యార్థికి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
వికారాబాద్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇటీవల పదో తరగతి పరీక్షల్లో తొలి రోజే ప్రశ్నపత్రాలు ఈ జిల్లా నుంచే లీకయ్యాయి. జిల్లాలోని తాండూరు పట్టణంలోని ఓ పరీక్ష కేంద్రం నుంచి తెలుగు ప్రశ్న పత్రం లీకైంది. అయితే ఆ తరువాత మాస్ కాపీయింగ్ జరగకుండా స్ట్రిక్ట్ చేశారు. ఈక్రమంలో ఓ విద్యార్ధి తాను పరీక్ష సరిగ్గా రాయలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం పిన్నెముల గ్రామానికి చెందిన కిష్టప్ప మల్లమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వారి చివరి వాడైన రమేష్ యాలాల మండలం మల్రెడ్డిపల్లిలో జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.
పదో తరగతి పరీక్షల్లో భాగంగా ఏఫ్రిల్ 3వ తేదీన గౌతమి పాఠశాలలో రమేష్ పరీక్షకు హాజరయ్యాడు. అయితే తెలుగు పరీక్ష సరిగ్గా రాయలేదని రమేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పరీక్ష అనంతరం ఇంటికి వచ్చి.. హాల్ టికెట్ వదిలి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా కూడా రెండు రోజులు కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు యాలాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి రమేశ్ కోసం గాలిస్తున్న సమయంలో మల్రెడ్డి గ్రామం సమీపంలో ఉన్న రెడ్డి చెరువులో ఓ శవం ఉన్నట్లు వారికి సమాచారం వచ్చింది.
దీంతో అక్కడి వెళ్లిన పోలీసు.. అది రమేశ్ మృతదేహంగా గుర్తించారు. దీంతో మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం శవ పంచనామ పూర్తి చేయించి, తాండూర్ లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. రమేష్ మృతితో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రాష్ట్రంలో పదో తరగతి పేపర్ లీకేజీల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఏప్రిల్ 3న మొదటి పరీక్ష తెలుగు ప్రారంభం కాగా.. వికారాబాద్ జిల్లా తాండూరులో పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే పేపర్ బయటికొచ్చింది. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఇదే పదో తరగతి పరీక్షల విషయంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.