తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నపత్రాలు లీక్స్ కలకలం రేపుతున్నాయి. టీఎస్‌పీఎస్‌సీ నుంచి పదో తరగతి పరీక్షల వరకు పేపర్ లీక్స్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. సోమవారం పదో తరగతి తెలుగు పేపర్ లీకైన ఘటన మరువక ముందే.. నేడు హిందీ పేపర్ కూడా లీకైంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నపత్రాలు లీక్స్ కలకలం రేపుతున్నాయి. టీఎస్‌పీఎస్‌సీ నుంచి పదో తరగతి పరీక్షల వరకు పేపర్ లీక్స్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే తెలుగు ప్రశ్నపత్రం లీకైన విషయం తెలిసిందే. నేడు కూడా హిందీ పేపర్ లీక్ అవ్వడం పెను సంచలనానికి దారితీసింది. నిన్న వికారాబాద్ జిల్లా తాండూరులో తెలుగు పేపర్ లీక్ అవ్వగా.. నేడు వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ అయింది. ఇవాళ హిందీ పరీక్ష ప్రారంభమైన కొన్ని సెకన్లకే ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
తెలంగాణలో పేపర్ లీక్స్ పరంపరం కొనసాగుతంది. నిన్న వికారాబాద్ జిల్లాలోని తాండూరులో తెలుగు పేపర్ లీకైన ఘటన మరుక ముందే.. తాజాగా వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీకైంది. పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాల్లో హిందీ ప్రశ్న పత్రం వాట్సాప్ గ్రూప్ లలో సర్క్యూలేట్ అయింది. నిన్న వికారాబాద్ జిల్లా ఇవాళ వరంగల్ జిల్లాలో పదో తరగతి పేపర్ లీకేజ్ జరగడంతో అందరు షాకవుతున్నారు. వరుసగ రెండో రోజు కూడా పరీక్ష పేపర్ బయటకు రావడం విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.